బన్నీ పై సీరియస్ అయిన స్నేహ

Sneha Reddy serious on Allu Arjun

10:49 AM ON 16th May, 2016 By Mirchi Vilas

Sneha Reddy serious on Allu Arjun

స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తనయుడిగా హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ ఆ తరువాత స్టైలిష్ స్టార్ గా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయాడు.. అయితే 2011లో అల్లు అర్జున్ స్నేహ అనే అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నాడు.. 2014లో వీళ్ళిద్దరి ప్రేమకు చిహ్నంగా ఒక బాబు కూడా పుట్టాడు. అయితే ఇటీవల ఆ బాబు విషయంలో స్నేహ బన్నీని కోపం పడిందట.. అసలు ఎందుకు తిట్టిందో తెలుసుకోవాలంటే అసలు విషయంలోకి వెళ్ళాల్సిందే.. బన్నీ ఈ మధ్య తన కొడుకు అయాన్ కు స్నానం చేయించారట. బాత్రూమ్ నుంచి బయటకు తీసుకొచ్చి.. మ్యాట్ మీద నిలబడి.. అయాన్ ను తన కాళ్ల మధ్యలో నిలబెట్టుకున్నారట.

అంతే.. జర్రున జారిన అయాన్ వెనక్కి బోర్లా పడ్డాడట. తలకి బాగా దెబ్బ తగలడంతో, గుక్కపెట్టి ఏడ్చేసాడట. దాంతోపాటు తిన్నది మొత్తం కక్కేయడంతో బన్నీకి చాలా భయమేసిందట. కొద్దిసేపటికి నార్మల్ అయ్యాక డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లి చెకప్ చేయించారట. ఏం ఫర్లేదని డాక్టర్ చెప్పడంతో బన్నీ ఊపిరి పీల్చుకున్నాడట. కానీ.. ఆయన భార్య స్నేహ మాత్రం ‘నిన్ను నమ్మి రెండు రోజులు బాబును అప్పగిస్తేనా?’ అని సీరియస్ అయిపోయిందట. ‘సరైనోడు’ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బన్నీ ఈ విషయాన్ని తెలియజేసాడు..

English summary

Sneha Reddy serious on Allu Arjun