ఈ ఘోరాలు ఏ దేశంలో? ఇలాంటి దృశ్యాలు ఇంకెన్నో!

So many children injured in Syria war

12:16 PM ON 19th August, 2016 By Mirchi Vilas

So many children injured in Syria war

ఆటలు ఆడుకోవాల్సిన చిట్టి చేతులు.. అక్కడ భయంతో వణికిపోతుంటాయి. ఏ నిమిషాన ఏం జరుగుతుందో అర్థంకాక ఉక్కిరిబిక్కిరి అవుతుంటారు. తమ తప్పేం లేకున్నా.. నిత్యం నరకయాతన పడే చిన్నారుల్ని చూస్తే.. దేవుడి మీద కోపం రావటం ఖాయం. ప్రపంచంలో శాపగ్రస్త దేశాలుగా మారిన కొన్ని దేశాల్లో సిరియా ఒకటి. మతోన్మాదంతో మనిషి కాస్తా రాక్షసుడైతే ఏం జరుగుతుందో సిరియాను చూస్తే అర్థమవుతుంది. సిరియాలో జరుగుతోన్న దమనకాండకు ప్రబల నిదర్శనం ఈ బాలుడి చిత్రం. అక్కడి అలెప్పో ప్రాంతంపై జరిపిన వైమానిక దాడుల్లో తీవ్రంగా గాయపడి రక్తమోడుతోన్న ఈ బాలుడి వీడియో సిరియన్ ప్రతిపక్ష కార్యకర్తలు రిలీజ్ చేశారు.

ఈ నెల 17న సిరియా రాజధానికి ఉత్తరాన ఉన్న నగరంలో తిరుగుబాటుదారులు వైమానిక దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లోఒక భవనం పాక్షికంగా దెబ్బతింది. ఈ బిల్డింగ్ లో చిక్కుకుపోయిన ఒక చిన్నారిని సిరియా సహాయక సిబ్బంది రక్షించి చికిత్స కోసం అంబులెన్స్ లో ఉంచారు. ఆ సమయంలో ఒక ఫోటోగ్రాఫర్ ఫోటో తీశారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. మొఖమంతా దుమ్ము, రక్తంతో నిండిన ఆ బాలుడ్ని అంబులెన్స్ లో కూర్చోబెట్టి తరలిస్తున్న చిత్రం ఇది. ఉగ్రవాదుల కారణంగా సిరియా నుంచి వలస వెళుతున్న వారి పడవ సముద్రంలో మునిగిపోవటం, ఓ చిన్నారి సముద్రపు ఒడ్డుకు కొట్టుకు వచ్చిన ఘటనకు చెందిన ఫోటో ప్రపంచం మొత్తాన్ని కదిలించివేసింది.

ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పాక్షికంగా దెబ్బ తిన్న భవనం నుంచి చిన్నారిని బయటకు తీసుకొచ్చిన గంట తర్వాత భవనం పూర్తిగా కూలిపోవటం గమనార్హం. మరోవైపు ఈ ఫోటోను చూస్తే.. మనిషిలోని మానవత్వాన్ని చంపేసిన మతోన్మాదాన్ని.. ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించివేయాలన్న భావన కలుగుతుంది.

English summary

So many children injured in Syria war