'అన్నమయ్య' సినిమా మొత్తం అన్నీ తప్పులే... షాకింగ్ న్యూస్

So many mistakes in Annamayya movie

01:12 PM ON 20th August, 2016 By Mirchi Vilas

So many mistakes in Annamayya movie

దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు, హీరో నాగార్జున కాంబినేషన్ లో వచ్చిన అన్నమయ్య సినిమా అప్పట్లో సంచలనం.. సామాన్య జనం కూడా పాడుకునే విధంగా అద్భుత బాణీలతో చిత్రాన్ని రూపొందించారంటూ అప్పట్లో ప్రశంసలు కూడా లభించాయి. అయితే ఆ సినిమా అంతా తప్పుల తడకగా ఉందట. ఈ షాకింగ్ కామెంట్స్ చేసింది ఎవరో సంచలన వ్యక్తుల్లో వివాదాస్పద వ్యక్తుల్లో కాదు, అన్నమాచార్యని సంకీర్తనల ఆలాపనలో ప్రత్యేకశైలిని పుణికి పుచ్చుకున్న శోభారాజ్ చేసిన వ్యాఖ్యలివి. కృష్ణా పుష్కర మహోత్సవాలలో భాగంగా కళావేదికపై తన సంకీర్తనా గానాన్ని వినిపించేందుకు వచ్చిన శోభారాజ్ విలేకరులతో ముచ్చటించారు.

అన్నమయ్య సినిమాలో అన్నమయ్య పాత్ర, సాళువ నరసింహరాయలు పాత్ర తప్పుదారి పట్టాయి. సాళువ రాయలను హాస్య పాత్రగా దర్శకుడు చిత్రీకరించటం, అన్నమయ్య ఇద్దరు భార్యల వెంట పడటం వంటి వాటి ద్వారా పాత్రలను తప్పుదారి పట్టించారు. అన్నమయ్య చెప్పుకున్న అంశాలను బట్టి ఆయన జీవితాన్ని అధ్యయనం చేసి 1985లో 108 ఎపిసోడ్ లతో ఒక సీరియల్ రాశా. దూరదర్శనలో ఆరు ఎపిసోడ్ లతో మరొకటి నిర్మించా అని శోభారాజ్ వివరించారు.

English summary

So many mistakes in Annamayya movie