హౌసింగ్‌.కామ్‌లో సాఫ్ట్‌ బ్యాంక్‌ 100 కోట్ల పెట్టుబడి

Softbank Invests 100 crores in Housing.com

11:14 AM ON 22nd January, 2016 By Mirchi Vilas

Softbank Invests 100 crores in Housing.com

రియల్‌ ఎస్టేట్‌ వెబ్‌సైట్‌ హౌసింగ్‌.కామ్‌లో జపాన్‌కు చెందిన సాఫ్ట్‌ బ్యాంక్‌ భారీగా పెట్టుబడులు పెట్టనుంది. తమ వెబ్‌సైట్‌లో ఆ బ్యాంకు రూ.100 కోట్ల మేర పెట్టుబడులు పెడుతున్నట్లు హౌసింగ్‌.కామ్‌ వెల్లడించింది. ఈ పెట్టుబడితో తమ సంస్థలో సాఫ్ట్‌ బ్యాంక్‌ వాటా 30శాతంగా ఉంటుందని తెలిపింది. ఈ విషయమై హౌసింగ్‌.కామ్‌ సీఈఓ జాసన్‌ కొఠారి మాట్లాడుతూ.. ‘సాఫ్ట్‌ బ్యాంక్‌ ప్రపంచంలోని పెద్ద పెట్టుబడిదారుల్లో ఒకటి. అలాంటి సంస్థ మా సంస్థలో పెట్టుబడులు పెట్టడం, దీర్ఘకాలంపాటు మాతో ఒప్పందానికి ముందుకు రావడం మాకు చాలా సంతోషాన్నిచ్చింది’ అన్నారు. హౌసింగ్‌.కామ్‌ పోర్టల్‌ 2012లో ప్రారంభమయ్యింది. నెక్సస్‌ వెంచర్స్‌, ఫాల్కన్‌ ఎడ్జ్‌, హెలియోన్‌ వెంచర్స్‌తోపాటు సాఫ్ట్‌ బ్యాంక్‌ల నుంచి ఈ సంస్థలోకి పెట్టుబడులు వచ్చాయి.

English summary

Soft invests 100 crores in Popular Real Estate firm Housing.com.With this investment soft bank gets 30 % of share from housing.com. This was said by one of the Housing.com Official