ప్రేమ వ్యవహారంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య

Software Employee Suicide In Hyderabad

11:24 AM ON 29th March, 2016 By Mirchi Vilas

Software Employee Suicide In Hyderabad

ప్రేమ వ్యవహారంలో చోటుచేసుకుంటున్న దారుణాలలో భాగంగా మరో విషాదం చోటుచుకుంది. ప్రేమకు సంబంధించి వచ్చిన మనస్ప ర్థల కారణంగా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. వివరాల్ల్లోకి వెళితే, హైదరాబాద్ మల్కాజ్ గిరి మౌలాలి తిర్మల్‌ నగర్‌కు చెందిన రీనా సిల్వియా రిచర్డ్‌సన్‌(23) డిలైట్‌ కంపనీలో(హెచ్‌ఆర్‌) పనిచేస్తున్నారు. ఈమెకు కళాశాల నుంచి స్నేహితుడైన మేడిపల్లికి చెందిన డెన్జిల్‌తో పరిచయం ఉండడంతో ప్రేమగా మారింది.

ఐదేళ్ల నుంచి వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోంది. డెన్జిల్‌ రీనా పనిచేసే సంస్థలోనే చేస్తున్నాడు. ఆదివారం రాత్రి డెన్జిల్‌ కుటుంబ సభ్యులు, రీనా మధ్య గొడవ జరిగినట్టు పోలీసు వర్గాల ద్వారా తెలిసింది. అదే రోజు రాత్రి మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఘర్షణ అనంతరం రీనా ఇంటికి వచ్చేసింది. మనస్తాపం చెందిన ఆమె సోమవారం ఉదయం చున్నీతో ఉరేసుకుంది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను చికిత్స నిమిత్తం ఈసీఐఎల్‌లోగల జీనియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందిందని వైద్యులు ధ్రువీకరించారు. రీనా తల్లి మేరీజాన్‌ ఫిర్యాదు మేరకు మల్కాజిగిరి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన ఆప్రాంతంలో సంచలన సృష్టించింది.

ఇవి కుడా చుడండి:

నగ్నంగా నటించడానికి నేను రెడీ..

బాహుబలికి అవార్డా? అంటూ వర్మ ట్వీట్

హీరోయిన్స్ ని ఏడిపిస్తున్నాడని వార్నింగ్ ఇచ్చిన మోహన్ బాబు

English summary

A Software employee named Reena was committed suicide by hanging herself to fan in Hyderabad was working as a HR in Popular Deloitte software company.