'పవన్‌' పాటకి చిందేసిన టెక్కీలు!!

Software employees dances for Pawan Kalyan songs

05:08 PM ON 30th December, 2015 By Mirchi Vilas

Software employees dances for Pawan Kalyan songs

పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌, ఈ పేరు దేశవ్యాప్తంగా ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పెద్దవాళ్ల నుండి చిన్న పిల్లల వరకు పవన్‌కళ్యాణ్‌ తెలియని వారుండరు. పవన్‌కళ్యాణ్‌ తో సినిమా చేస్తే చాలు ఇంకేమీ వద్దు అనుకునే హీరోయిన్లు ఉన్నారంటే అది అతిశయోక్తి కాదు. బడా ప్రొడ్యూసర్లు సైతం పవన్‌కళ్యాణ్‌ తో సినిమా చేసి కాసులు రాబట్టుకోవచ్చని ఆలోచిస్తారు. పబ్లిక్‌లో పవన్‌కళ్యాణ్‌ కున్న ఫాలోయింగే వేరప్ప. ఇప్పుడు పవన్ కల్యాణ్ గురించి ఇంతలా చెప్పడానికి కారణం ఒకటి ఉంది. అసలు విషయానికొస్తే ఎప్పుడూ కంప్యూటర్లతో బిజిగా ఉండే సాఫ్ట్‌వేర్‌ ఎంప్లాయ్స్‌ ఇప్పుడు రూటు మారుస్తున్నారు.

ఎప్పుడూ పనే అయితే బోర్‌ కొట్టేస్తాది అని ఆలోచిస్తున్నారు. అందుకే సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌లో కల్చరల్‌ ఈవెంట్స్‌ నిర్వహిస్తున్నారు. తాజాగా ఒక సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేసే ఉద్యోగులు ఫ్లాష్‌ మోబ్‌లో పవన్‌కళ్యాణ్‌ పై తమకున్న అభిమానాన్ని చాటి చెప్పారు. మిర్చివిలాస్‌.కామ్‌ ఈ వీడియోని మీకోసం అందిస్తుంది, చూసి ఆనందించండి.

English summary

Infosys software company employees dances for Pawan Kalyan songs.