ఇద్దరు వైఫ్ లు స్యూసైడ్ చేసుకోగా, మూడో భార్యను గన్ తో కాల్చేశాడు

Software Engineer Fired His Wife With Gun In Pune

11:07 AM ON 16th July, 2016 By Mirchi Vilas

Software Engineer Fired His Wife With Gun In Pune

ఎంత చదువుకున్నా, మనస్సు సరిగా లేకపోతే చేసే పనులు తలదించుకునేలా ఉంటాయి. నేరం వైపు చేష్టలు వెళ్తాయి. సరిగా ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ విషయంలో చోటుచేసుకుంది. అతని అనుమానం పెనుభూతమైంది. సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవాల్సిందిపోయి భార్యను దారుణంగా చంపేశాడు. చివరికి పోలీసులకు చిక్కాడు. ఈ ఘటన పూర్వాపరాల్లోకి వెళ్తే, పూణెకు చెందిన 40ఏళ్ల మనోజ్ పటిదార్- 34 ఏళ్ల అంజలి పటిదార్ లకు ఐదేళ్ల కిందట వీళ్లిద్దరు మ్యారేజ్ చేసుకున్నారు. వీళ్లకి నాలుగేళ్ల ఓ బాబు కూడా వున్నాడు. మనోజ్ ఐటీ కంపెనీలో ఇంజనీర్ గా పనిచేస్తుండగా, అంజలి గైనాకాలజిస్ట్‌. వాకడ్ చౌక్ లోని ఓ భవనంలో ఉంటుండగా, అందులో ఓ విభాగంలో గైనాకాలజిస్ట్ అయిన అంజలి క్లినిక్ నడుపుతోంది.

కొద్దిరోజులుగా మనోజ్ కు తన భార్యపై అనుమానం మొదలైంది. మరెవరితో ఆమెకు రిలేషన్ వున్నట్లు భ్రమలోపడ్డాడు. ఈ క్రమంలో గడిచిన రెండేళ్ళుగా ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. ఈ విషయంలో ఇరుగుపొరుగువాళ్లు పెద్దగా పట్టించుకోలేదు. ఐతే, బుధవారం రాత్రి ఇద్దరు ఘర్షణకు దిగారు. రాత్రి 9 గంటల టైమ్ లో సోఫాలో కొడుకుతో కలిసి నిద్రపోతున్న అంజలిని నుదుటిపై గన్ తో కాల్చి చంపేశాడు. ఆ వెంటనే కారులో పారిపోతూ తన తల్లికి ఫోన్ చేసి తాను అంజలిని గాయపరిచానని చెప్పాడు. ఆ మాటలు విన్న అతడి తల్లి విషయం తెలపడంతో అలెర్ట్ అయిన పోలీసులు అతణ్ని కారులో పారిపోతుండగా అరెస్ట్ చేశారు. నేరం జరిగిన ఓ గంటలోనే అరెస్టు చేసి, విచారణ చేపట్టారు. తన భార్య వేరే వారితో ఉండటం మనోజ్ చూశాడని, అది భరించలేక ఆమెను హత్య చేశాడని పోలీసులు చెబుతున్నమాట. ఇంతకీ అసలు విషయం ఏమంటే, మనోజ్ కి అంజలి మూడో వైఫ్. అంతకుముందు ఇద్దరు భార్యలు సూసైడ్ కు పాల్పడ్డారు. దీంతో ఈ కేసుని పోలీసులు సీరియస్ గా తీసుకుని విచారణ స్టార్ట్ చేశారు.

ఇవి కూడా చదవండి:గోల్డ్ మేన్ ని దారుణంగా చంపేశారు

ఇవి కూడా చదవండి:ఎడమ చేతి వాటం వెనుక అసలు రహస్యం

English summary

A Software Engineer Name Manoj who was working as a Software engineer in Pune was killed his Wife named Anjali. He shooted his wIfe Anjali and tried to escape in car and police arrested him within one hour of the incident happened.