బిచ్చగత్తె గా మారిన సాఫ్ట్వేర్ ఇంజనీర్!!

Software Engineer turned as a Beggar

01:59 PM ON 9th March, 2016 By Mirchi Vilas

Software Engineer turned as a Beggar

అవునా అంటే అవుననే ఈ ఘటన తెలుపుతోంది. పైగా ఎక్కడో మారుమూల గ్రామంలో కాదు... ఏకంగా దేశ రాజధాని ఢిల్లీ వీధుల్లో దర్శనమిచ్చే ఘటన ఇది. వివరాల్లోకి వెళితే, సైన్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉన్న కిరణ్ సాక్షి బిచ్చమెత్తుకుంటూ నెట్టుకొస్తోంది. కంప్యూటర్ సైన్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉన్న కిరణ్ సాక్షి ట్రాన్స్‌జెండర్. ఆమె ట్రాన్స్‌జెండర్ అని తెలిసే రెండేళ్ల కిందట ఓ కంపెనీ ఉద్యోగమిచ్చింది. కానీ తోటివారి నుంచి వివక్ష, సూటిపోటి మాటలతో కిరణ్ 2014 మార్చి నెలలో ఉద్యోగానికి చెల్లు చీటీ ఇచ్చేసింది. అయితే కంపెనీ డైరెక్టర్లు, భరోసా ఇచ్చినా కూడా అవమానాలు ఆగకపోవడంతో, బయటకు వచ్చిన ఈమె రెండేళ్ల కాలంగా ఢిల్లీ వీధులలో బిచ్చమెత్తుకుంటూ నరకయాతన పడుతోంది.

ఇది చూసిన ఆమె అక్కాచెల్లెళ్ళు తమ ఫేస్‌బుక్ అకౌంట్‌లో కిరణ్ బయోడేటాను పెట్టి ఉద్యోగం ఇప్పించాలని కోరుతున్నారు. మరి ఎవరు స్పందిస్తారో...

English summary

Software Engineer turned as a Beggar in Delhi. Kiran sakshi is worked in Softaware company Delhi But she is a transgender.