ప్రియురాలి కోరిక తీర్చడానికి దొంగగా మారిన టెక్కీ! ఇందులో ట్విస్ట్ ఏంటంటే?

Software Enginner snatches chain for girl friend

04:30 PM ON 9th June, 2016 By Mirchi Vilas

Software Enginner snatches chain for girl friend

ఈ మధ్య గర్ల్ ఫ్రెండ్ ల కోసం ఏపని చేయడానికైనా కొందరు సిద్ధమవుతుంటే, భలేగా వుందని గర్ల్ ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో కొందరు యువకులు గర్ల్ ఫ్రెండ్స్ కోరికలు తీర్చడానికి దొంగలుగా మారుతున్నారు. తాజాగా తన గర్ల్ ఫ్రెండ్ గొంతెమ్మ కోరికలు తీర్చేందుకు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ చేసిన పాడు పని అతడ్ని పోలీసులకు అడ్డంగా బుక్కయ్యేలా చేసింది. ఈ ఘటన చెన్నైలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. థౌజండ్ లైట్స్ ఏరియాకి చెందిన కార్తికేయన్(24) పాత మహాబలిపురం రోడ్డులో ఉన్న ఐటీ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా విధులు నిర్వహిస్తున్నాడు.

సర్దార్ పటేల్ రోడ్డులోని గాంధీమండపం ముందున్న బస్టాప్ కు దగ్గర్లో బండిని పార్క్ చేశాడు. అనంతరం కొట్టూర్ పురం వెళ్లేందుకు బస్ కోసం ఎదురు చూస్తున్న వాసంతి(42) అనే మహిళ వద్దకెళ్లిన కార్తికేయన్.. అడ్రస్ అడుగుతున్న వాడిలా నటించి, ఆమె మెడలో ఉన్న చైన్ లాక్కుని పరుగు ప్రారంభించాడు. షాక్ తిన్న వాసంతి కేకలు వేయడం ప్రారంభించింది. అయితే.. బస్టాప్ దగ్గర పార్క్ చేసిన కార్తికేయన్ బైక్ స్టార్ట్ కాలేదు. అటుగా వస్తున్న పోలీసులు అప్రమత్తం కావడంతో కార్తికేయన్ ను అనుసరించిన పోలీసులు అతన్ని పట్టేశారు. అతనిని విచారించిన పోలీసులు విషయం తెల్సి షాకయ్యారు.

తన గర్ల్ ఫ్రెండ్ కోరిక తీర్చేందుకే దొంగతనం చేశానని చెప్పాడు. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా సంపాదిస్తున్నప్పటికీ.. గర్ల్ ఫ్రెండ్ గొంతెమ్మ కోర్కెలు తీర్చడం కోసం దొంగగా మారాల్సి వచ్చిందన్నాడు. కొసమెరుపు ఏమంటే, కార్తికేయన్ కొట్టేసిన చైన్ రోల్డ్ గోల్డ్ అట. మొత్తానికి కేసు నమోదు చేసిన పోలీసులు కార్తికేయన్ ని రికార్డు పరిశీలిస్తున్నారు. ట్విస్ట్ లో ట్విస్ట్ అంటే ఇదేనేమో..

English summary

Software Enginner snatches chain for girl friend