క్లాసులు ఎగ్గొట్టి ...

Soggade Chinni Nayana Director About His Movie Carrier

10:07 AM ON 30th January, 2016 By Mirchi Vilas

Soggade Chinni Nayana Director About His Movie Carrier

తొలి చిత్రం తోనే అనూహ్య విజయం అందుకున్న వర్ధమాన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ .. ఎన్నో అవకాశాల కోసం చూసి , చూసి చివరకు లేట్‌గా వచ్చినా లేటెస్ట్‌ హిట్‌తో మెప్పించాడు. పైగా అగ్ర హీరో నాగార్జునతో హిట్ కొట్టాడు. దీంతో ఇండస్ట్రీ లో అందరి దృష్టి కళ్యాణ్ పై పడింది. వాస్తవానికి కళ్యాణ్ హీరో అవ్వాలనుకున్నాడు. అతనికి చిరంజీవి అభిమాన నటుడు. మెగాస్టార్ సినిమాలంటే పిచ్చి. చిరులా హీరో కావాల న్నది అతని కోరిక. స్టూడెంట్ లైఫ్ లోనే నాటకా లూ.... ఇక స్టెప్పులు ఇరగదీశాడు. కళ్యాణ్‌కృష్ణ. సొంతూరు తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి. అక్కడ నుంచి రంపచోడవరం వెళ్లి చదువుకునే కళ్యాణ్ . అక్కడ ఏదైనా కొత్త సినిమా వస్తే నేరుగా థియేటర్‌ వైపు అడుగులు పడేవట. ఇక మారేడుమిల్లి చుట్టుపక్కల ఆర్‌.నారాయణమూర్తి సినిమాల షూటింగ్‌లు అప్పట్లో ఏజన్సీ లోనే జోరుగా జరుగుతూ ఉండేవి. దీంతో క్లాసులు ఎగ్గొట్టి మరీ షూటింగ్ చూడ్డానికి వెళ్ళే పోయేవాడట.

వైజాగ్ లో పిజి చదవడానికి వెళ్ళిన కళ్యాణ్ కి ఆర్‌పీ పట్నాయక్‌, కులశేఖర్‌ ఏర్పడ్డ పరిచయం అతన్ని సినీ రంగానికి తీసుకొచ్చింది. దర్శకుడు తేజని కల్సి, అతని దగ్గర అసిస్టెంట్‌గా చేరి, జయం, నిజం, జై సినిమాలకు పనిచేసాడు. ఇక ఆతర్వాత తర్వాత పోసాని కృష్ణమురళి గారి దగ్గర పనిచేశా. అసిస్టెంట్‌ నుంచి అసోసియేట్‌ దర్శకుడినయ్యా నని చెప్పే కళ్యాణ్ కి ఎన్నో కష్టాల తర్వాత మొత్తానికి నాగ్ తో సినిమా చేసే అవకాశం రావడం , సోగ్గాడే చిన్ని నాయన ఈ సక్రాంటికి విడుదలై పెద్ద హిట్ అవ్వడం తెల్సిందే.

English summary