మొదటిసారి 50 కోట్ల నాగ్‌

Soggade Chinni Nayana in 50 crores club

03:15 PM ON 13th February, 2016 By Mirchi Vilas

Soggade Chinni Nayana in 50 crores club

అక్కినేని నాగార్జున తాజాగా నటించిన చిత్రం 'సోగ్గాడే చిన్ని నాయనా'. నాగార్జున చాలా కాలం తరువాత ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రంలో నాగ్‌ సరసన రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి హీరోయిన్లుగా నటించారు. కళ్యాణ్‌కృష్ణ కురసాల దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై ఘన విజయం సాధించింది. ఈ చిత్రం నాగార్జున కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు రాబట్టింది. కేవలం 15 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటి వరకు 50 కోట్లు వసూళ్లు రాబట్టింది. 2016 ప్రారంభంలో సరైన హిట్‌ ఏంటీ అంటే 'సోగ్గాడే చిన్ని నాయనా' అనే చెప్పారు. ఈ చిత్రాన్ని నిర్మించింది కూడా నాగార్జునా నే. ఇప్పుడు దీనికి మూడింతలు వసూళ్లు రాబడుతున్నారాయన.

ఇప్పటి వరకు 50 కోట్ల క్లబ్‌లో చేరింది ఒక్క ఈతరం హీరోలు మాత్రమే. ఇప్పుడు తాజాగా నాగార్జున కూడా ఈ ఫీట్‌ని సాధించారు.

English summary

Akkineni Nagarjuna latest block buster Soggade Chinni Nayana joined in 50 crores club. He is the onle one old generation hero that joined in 50 crores club.