సంక్రాంతికి 'సోగ్గాడు' లేనట్టే!!

Soggade Chinni Nayana is not in Sankranthi race

12:30 PM ON 5th January, 2016 By Mirchi Vilas

Soggade Chinni Nayana is not in Sankranthi race

దాదాపు సంవత్సరం నర తర్వాత నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం 'సోగ్గాడే చిన్నినాయనా'. కళ్యాణ్‌ కృష్ణ తెరకెక్కించిన ఈ చిత్రం ఘాటింగ్‌ ఇటీవలే పూర్తయింది. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేస్తున్నామని అధికారికంగా ప్రకటించారు కూడా. అయితే ఇప్పుడు కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల ఈ చిత్రం రిలీజ్‌ని వాయిదా వేశారు. ముందు ఈ చిత్రాన్ని జనవరి 14న విడుదల చేస్తున్నామని ప్రకటించగా, ఇప్పుడు జనవరి 22న విడుదల చేయబోతున్నామని మరోసారి అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రంలో నాగార్జున చాలా ఏళ్లు తర్వాత ద్విపాత్రాభినయం చేస్తున్నారు. కంప్లీట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠిలు కధానాయికలుగా నటించగా హాట్‌ యాంకర్‌ అనసూయ ముఖ్యపాత్రలో నటించింది.

English summary

Soggade Chinni Nayana release is postponed