'సోగ్గాడే చిన్ని నాయనా' ఆడియో డేట్‌ ఫిక్స్‌!

Soggade Chinni Nayana movie audio release date fixed

02:01 PM ON 8th December, 2015 By Mirchi Vilas

Soggade Chinni Nayana movie audio release date fixed

అక్కినేని నాగార్జున తాజాగా నటిస్తున్న చిత్రం 'సోగ్గాడే చిన్ని నాయనా'. ఆత్మల నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కళ్యాణ్‌ కృష్ణ దర్శకత్వం మహిస్తుండగా నాగార్జున సరసన రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో నాగార్జున మరోసారి ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని పోస్ట్‌ ప్రోడక్షన్‌ పనులు శరవేగంగా జరుపుకుంటుంది. అయితే తాజా సమాచారం ప్రకారం 'సోగ్గాడే చిన్నినాయనా' ఆడియోని డిసెంబర్‌ 27న హైదరాబాద్‌లో భారీగా విడుదల చెయ్యాలని ఫ్లాన్‌ చేస్తున్నారు.

ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందించారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకం పై నిర్మించిన ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాత రాధామోహన్‌ కథ, స్క్రీన్‌ప్లే అందించారు. సంక్రాంతి కానుకగా జనవరి 15న ఈ చిత్రం విడుదలవుతుంది.

English summary

Soggade Chinni Nayana movie audio release date fixed. Audio launch want to held in Hyderabad grandly on December 27th.