'సోగ్గాడు' రిలీజ్‌ డేట్‌!

Soggade Chinni Nayana movie release date

12:22 PM ON 6th January, 2016 By Mirchi Vilas

Soggade Chinni Nayana movie release date

దాదాపు సంవత్సరం నర తరువాత అక్కినేని నాగార్జున నటించిన తాజా చిత్రం 'సోగ్గాడే చిన్నినాయనా'. చైతన్య కృష్ణ అనే నూతన దర్శకుడు తెరకెక్కించిన ఈ చిత్రంలో నాగార్జున సరసన రమ్యకృష్ణ , లావణ్య త్రిపాఠిలు హీరోయిన్లుగా నటించారు. అయితే ఈ చిత్రం సంక్రాంతి కి విడుదలవుతుంది అని అప్పుట్లోనే చెప్పారు. అయితే నిన్న మళ్లీ వాయిదా పడిందిని చెప్పారు. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం 'సోగ్గాడే చిన్నినాయనా' సెన్సార్‌ పూర్తి కావడంతో జనవరి 15 న విడుదల చేయబోతున్నామని ప్రకటించారు. ఈ చిత్రానికి సెన్సార్‌ వారు యూ/ఎ సర్టిఫికేట్‌ ఇచ్చారు. నాగార్జున చాలా సంవత్సరాలు తరువాత ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ చిత్రంలో హాట్‌ యాంకర్‌ అనసూయ ముఖ్యపాత్రలో నటించింది.

English summary

Soggade Chinni Nayana movie got U/A certificate from censor board. And the movie is releasing on January 15th.