ఈ కారుకు పెట్రోల్‌ అక్కర్లేదు

Solar Car On Roads

06:33 PM ON 7th December, 2015 By Mirchi Vilas

Solar Car On Roads

పెట్రోల్‌ అవసరం లేకుండా సౌర శక్తితో నడిచే కారును బెంగుళూరుకు చెందిన యువ శాస్త్రవేత్తలు తయారు చేసారు. భారత దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న వాయుకాలుష్యం ను అరికట్టెందుకు ఈ కారు మంచి సమాధానంగా నిలువనుంది. సౌరవిద్యుత్‌తో నడిచే ఈ కారు వల్ల కాలుష్యం అనేది ఉండదని తెలిపారు.

ఈ కారును తయారుచేసిన సాజీద్‌ అహ్మద్‌ దీనికి 'సూర్యజ్యోతి' అనే పేరును కూడా పెట్టాడు. ఈ కారును బెంగుళూరు నుండి న్యూఢిల్లి వరకు దాదాపు 3,000 కిలో మీటర్ల దూరం పరీక్షించి చూసామని, ఇప్పుడు భారత సైన్స్‌ మంత్రిత్వ శాఖ వారు ఈ ప్రయోగాన్ని ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నంలో ఉన్నారు. ఈ కారును తయారు చేసిన శాస్త్రవేత్త మాట్లాడుతూ సౌర విద్యుత్‌ ఆధారంగా నడిచే ఈ కారును తయారు చెయ్యడానికి 1.2 లక్షల రూపాయలు ఖర్చు అయ్యిందని, ఈ కారుతో కిలోమీటర్‌కు కేవలం ఒక్కరూపాయి మాత్రమే ఖర్చవుతుందని తెలిపారు. ఈ కారులో ఐదు సోలార్‌ పెనల్స్‌ను, చార్జ్‌ అవ్వగలిగే లెడ్‌యాసిడ్‌ బ్యాటరీలను ఉపయోగించినట్లు తెలిపారు. ఈ కారులో బాటరీని ఒక్కసారిగా ఫుల్‌గా చార్జ్‌ అయితే 40 కిలోమీటర్ల దూరం వెళ్ళొచ్చని, గంటకు గరిష్టంగా 30 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించవచ్చని అన్నారు. భారత సైన్స్‌ మినిష్టర్‌ ఈ సౌర కారు పై ప్రయాణించి,ఇది చాలా బాగుందని, దీనివల్ల కాలుష్యం ఏమి ఉండదని అన్నారు. డిపార్టుమెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ వారు ఈ కారుకు మరింత ప్రోత్సహకం అందించి ఈ కారు కార్యరూపం దాల్చేలా చూడాలని మంత్రి అధికారులకు సూచించారు.

English summary

A solar powered car, designed by a Banglore young scientist Sajjad Ahmed.This car doesn't emits any type of harmful gases in air. This was testing by Department of Science and Technology under guidence of science minister of India Dr Harsh Vardhan