ఈ హనుమంతుడు మృత్యుంజయుడు

Soldier found alive After Six Days Under snow

04:40 PM ON 10th February, 2016 By Mirchi Vilas

Soldier found alive After Six Days Under snow

అతడు మామూలు సైనికుడు కాదు, అతడో స్ఫూర్తి ... అందుకే ఎముకలు కొరికే ఆ చలిలో తిరగడమే కష్టం. అలాంటిది 25 అడుగుల మంచు కింద ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 6 రోజులపాటు ఆ సైనికుడు చిక్కుకుని కూడా ప్రాణాలతో బయట పడ్డాడు. అతనితో ఉన్న 9 మందిలో 7వ రోజు 5 గురు చనిపోగా, మరో 4గురు గల్లం త్తవ్వగా అతను మాత్రం ప్రాణాలతో బయటపడి అందరినీ ఆశ్చర్యపరిచాడు. మృత్యుంజయు డయ్యాడు. అందుకే భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా అతన్ని స్వయంగా కల్సి అభినంచారు. ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే, ఫిబ్రవరి 3న సియాచిన్ గ్లాసియర్ ప్రాంతంలో 19,600 అడుగుల ఎత్తులో 10 మంది భారత సైనికులు భయంకరమైన అవలాంచ్ లో చిక్కుకున్నారు. వారి ఆచూకీ కోసం 6 రోజులపాటు వెతికినా, కనిపించలేదు. చివరగా 6వ రోజున అ ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తుండగా ,10 మందిలో లాన్స్ నాయక్ హనుమంతప్ప ఆశ్చర్యంగా ఆ మంచు కింద ప్రాణాలతో కనిపించాడట. 5గురు సైనికులు చనిపో గా, మరో 4గురి ఆచూకీ తెలియాల్సి ఉందని లెఫ్ట్ నెంట్ జనరల్ డీఎస్ హుడా చెబుతున్నారు.

మృత్యుంజయుడు అయిన హనుమంతప్పను పరామర్శించడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వయంగా డిల్లీలోని ఆర్మీ రీసెర్చ్‌ అండ్‌ రిఫరల్‌ ఆసుపత్రికి వెళ్లారు. అనంతరం ట్విటర్‌లో.. హనుమంతప్పను కొనియాడుతూ, అతడో అసాధారణ సైనికుడని పేర్కొన్నారు. ‘‘అతడి శక్తి సామర్థ్యాలు, ప్రతికూల పరిస్థితుల్లోనూ మొక్కవోని ధైర్యాన్ని వర్ణించడానికి మాటలు చాలవు’’ అని ప్రధాని పేర్కొన్నారు. ఆసుపత్రి సందర్శనకు ముందు కూడా మోదీ ట్విటర్‌లో వ్యాఖ్యలు చేశారు. ‘‘లాన్స్‌ నాయక్‌ హనుమంతప్పను పరామర్శించడానికి వెళుతున్నా. అతడు కోలుకోవాలన్న దేశ ప్రజల ప్రార్థనలను కూడా నా వెంట తీసుకెళుతున్నా’’ అని పేర్కొన్నారు. ప్రధాని వెంట సైనిక దళాల ప్రధానాధికారి జనరల్‌ దల్బీర్‌ సింగ్‌ సుహాగ్‌ కూడా ఉన్నారు. కాగా రాష్ట్రపతి ప్రణబ్‌ హనుమంతప్పను అభినందిస్తూ, అతడి సంకల్ప బలం, ప్రతికూల పరిస్థితులకు ఎదురొడ్డి పోరాడే స్ఫూర్తి ఆదర్శప్రాయమని అన్నారు. మొత్తానికి హనుమంతుడు చిరంజీవి అయితే , ఈ హనుమంతు మృత్యుంజయుడు. హేట్సాఫ్ హనుమంతప్ప అంటూ పలువురు సోషల్ మీడియాలో పోస్టింగ్స్ చేస్తున్నారు.

English summary

The jawan was trapped since February 3, when a wall of ice a kilometer wide and 800 metres high came crashing down on his army post, killing nine of his colleagues.Prime Minister Narendra Modi, who visited him at the Army Research and Referral hospital in Delhi, tweeted: "No words are enough to describe the endurance & indomitable spirit of Lance Naik Hanumanthappa. He is an outstanding soldier."