దీదీకి దిమ్మతిరిగే లేఖలను బయట పెట్టిన సైన్యం(వీడియో)

Soldiers puts out Mamatha Banerjee letters

01:22 PM ON 3rd December, 2016 By Mirchi Vilas

Soldiers puts out Mamatha Banerjee letters

పెద్ద నోట్ల రద్దు తర్వాత ఈ అంశంపై దేశంలో గట్టిగా గళం వినిపించిన పెర్సన్ ఎవరైనా వున్నారంటే, అది పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీయే. అవసరమైతే వామపక్షాలతో సైతం జతకడతానని దీదీ ప్రకటించడమేకాక, ఢిల్లీలో ధర్నా, దేశవ్యాప్త బంద్ లో కీలక పాత్ర వహించిన సంగతి తెల్సిందే. అయితే మరోపక్క పశ్చిమ బెంగాల్లో సైన్యం నిర్వస్తున్న తనిఖీలపై మమత సర్కార్ ఆరోపణలు గుప్పించింది. దీనికి తోడు మమతా బెనర్జీ ప్రయాణించిన విమానం దిగడానికి సిగ్నల్ రాక అరగంట సేపు ఆకాశంలో చక్కర్లు కొట్టింది. దీనిపై కూడా విమర్శలు, ఆరోపణలు గుప్పుమన్నాయి.

1/5 Pages

అయితే సైన్యం నిర్వహించే తనిఖీలపై చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని భారత ఆర్మీ నిరూపించింది. తనిఖీలపై సహకరించాలంటూ తాము ముందుగానే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి తెలిపామని వెల్లడించింది. దీనికి సంబంధించిన నాలుగు ప్రభుత్వ శాఖలకు రాసిన లేఖలను విడుదల చేసింది. సంబంధిత అధికారులకు తనిఖీల గురించి ముందుగానే తెలుసునని ఆర్మీ విడుదల చేసిన లేఖలను బట్టి స్పష్టమవుతోంది.

English summary

Soldiers puts out Mamatha Banerjee letters