శత్రువులను చంపమని పిలుపునిచ్చిన మంత్రి  

Soldiers should kill the enemy

03:40 PM ON 14th December, 2015 By Mirchi Vilas

Soldiers should kill the enemy

భారత రక్షణ శాఖ మంత్రి మనోభర్‌ పర్రికర్‌ సైనికుల ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటన పై స్పదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైన్యంలోని వారు శత్రువులను చంపే విధంగా ఉండాలని, తమకు తామ ప్రాణాలను తీసుకునే విధంగా ఉండకూడదని అన్నారు.

దేశం కోసం సైనికులు ప్రాణ త్యాగం చేసేందుకు సిద్దంగా ఉండాలన్న వాదనకు తాను వ్యతిరేకమని అన్నారు. సైనికుడు అనేవాడు శత్రువులను చంపే విధంగా ఉండాలని అన్నారు.

ఈ సంవత్సరం మొదట్లో ఇండో-మయన్మార్‌ సరిహద్దులో భారత్‌ సైన్యం చనిపోయిన కొద్ది గంటల్లోనే సమావేశం అయ్యానని, దీనికి కేంద్ర హొమ్ శాఖా మంత్రి రాజ్‌నాధ్‌ సింగ్‌ మద్దతు అభించిందని అన్నారు. ఆ మొత్తం ఆపరేషన్‌సు చాలా రహస్యంగా పూర్తి చేశామని తెలిపారు. మణిపూర్‌ లో 18 మంది ఆర్మీ సైనికులను హతమార్చినందుకు ప్రతీకారంగా జూన్‌ నెలలో ఎన్‌యస్‌సిఎన్‌ తీవ్రవాదుల శిబిరాలను నాశనం చేశామని ఆయన అన్నారు.

తాను భద్రత లేకుండానే బయటికి వెళ్ళడానికి ఇష్టపడతానని, భద్రత ఉన్నా అన్ని సార్లు సురక్షితం కాదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్‌ పర్రికర్‌ చెప్పుకొచ్చారు.

English summary

Indian Defence Minister Manohar Parrikar on Sunday said soldiers should kill the enemy instead of being lay down their own lives