ముస్లింలపై వివక్ష ఉందంటూ రిక్రూట్ మెంట్

Somalia Terrorists Groups use Donald Trump in recruiting film

06:51 PM ON 8th January, 2016 By Mirchi Vilas

Somalia Terrorists Groups use Donald Trump in recruiting film

అమెరికాలో నల్ల జాతీయులతో పాటు ముస్లింలపై కూడా జాతి వివక్ష వేళ్లూనుకు పోయిందని ప్రచారం చేస్తూ అల్‌ఖైదా అనుబంధ మిలిటెంట్‌ సంస్థ సోమాలియాలో రిక్రూట్‌మెంట్‌లు కొనసాగిస్తోంది. తన ప్రచారానికి మద్దతుగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ అభ్యర్ధిత్వానికి పోటీ పడుతున్న డొనాల్డ్‌ ట్రంప్‌ తన ప్రచారంలో వినియోగిస్తున్న 52 నిముషాల నిడివి వున్న వీడియో ప్రచార చిత్రాన్ని ఈ సంస్థ ఇటీవల విడుదల చేసింది. ముస్లింలను అమెరికాలో అడుగు పెట్టనీయకుండా నిషేధం విధించాలంటూ డోనాల్డ్‌ ట్రంప్‌ ఇచ్చిన పిలుపు ఈ వీడియోలో ప్రముఖంగా కన్పిస్తోంది. అమెరికాలో కొనసాగుతున్న జాతివివక్షకు రాడికల్‌ ఇస్లామ్‌ ఒక్కటే పరిష్కారమని అల్‌షబాబ్‌ ఈచిత్రంలో చెబుతోంది. ఈ చిత్ర ప్రదర్శనల ద్వారా ముస్లిం యువకుల్లో భావోద్వేగాలను రగిల్చి తీవ్రవాదం వైపు మళ్లించేందుకు అల్‌షబాబ్‌ సంస్థ ప్రయత్నిస్తోందని పరిశీలకులు చెబుతున్నారు.

English summary

Somalia’s Islamist militant group al-Shabaab has used a clip of Republican presidential frontrunner Donald Trump in its latest recruitment film.