హోం మంత్రి జోక్యంతో అ ఆ మూవీ లో అవి తీసేసారు

Some dialogues muted in A Aa movie

03:57 PM ON 17th June, 2016 By Mirchi Vilas

Some dialogues muted in A Aa movie

సెన్సారై వచ్చిన సినిమాకు మళ్ళీ సెన్సార్ పడింది. క్లీన్ కామెడీగా సెన్సార్ నుంచి యూ సర్టిఫికేట్ తెచ్చుకుని.. సక్సెస్ లో దూసుకెళుతున్న అ..ఆ సినిమాలో కట్స్ విధించాల్సి వచ్చింది. అది కూడా ఓ కులాన్ని అవమానించారనే కంప్లెయింట్ రావడంతో ఈ కట్స్ విధించాల్సి వచ్చింది. ఓసారి వివరాల్లోకి వెళ్తే.. అ..ఆ.. మూవీలో కమెడియన్ షకలక శంకర్ ఓ దొంగ పాత్ర పోషిస్తాడు. ఈ రోల్ పేరు ప్రతాప్ రెడ్డి. అలాగే ఇతని తండ్రి రోల్ కనిపించకపోయినా.. డైలాగ్స్ లో మాత్రం ఫాదర్ పేరు బాల్ రెడ్డి ఫ్రం బంజారా హిల్స్ అని చెప్తారు. ఇప్పుడీ రెండు పేర్లకు సంబంధించి.. రెడ్డి అనే పదాలను మ్యూట్ చేయాలని ఆదేశించింది సెన్సార్ బోర్డ్.

సినిమా రిలీజ్ అయిన రెండు రోజులకే రెడ్డి జన సంఘం ఈ పేర్ల పై ఫిర్యాదు చేసింది. తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి కూడా జోక్యం చేసుకోవడంతో.. ఈ పేర్ల విషయంలో రెడ్డి అనే పదాన్ని మేకర్స్ మ్యూట్ చేశారు. పేర్ల విషయంలో అభ్యంతరాలు వచ్చినా.. అప్పటికే డిజిటల్ ప్రింట్స్ వెళ్లిపోయాయి. ఇవి వారం పాటు లాక్ అయిపోతాయి. వీటిని ఆ సమయంలో ఏం చేయలేం. మిగతా థియేటర్స్ కు మార్చిన వెర్షన్ పంపాం. ఇప్పుడు అన్ని థియేటర్లలోనూ పేర్లను మ్యూట్ చేసిన మేరకే టెలికాస్ట్ అవుతున్నాయి. అయితే.. మేం ఆ కమ్యూనిటీని అవమానించేలా ఎటువంటి సీన్స్ పిక్చరైజ్ చేయలేదు అంటున్నారు. మొత్తానికి సినిమా హిట్ తో పాటూ ఇలాంటి ఇబ్బందులూ ఉంటాయని మరోసారి నిరూపితమైంది.

English summary

Some dialogues muted in A Aa movie