ఫ్రిజ్ లో పెట్టకూడని ఆహార పదార్ధాలు ??

Some foods should never refrigerate

05:12 PM ON 4th December, 2015 By Mirchi Vilas

Some foods should never refrigerate

రిఫ్రిజిరేటర్ ని ఆహారాన్ని ఆదా చేసుకోవడానికి ఆవిష్కరించారు. కాని అందులో అన్ని పెట్టకూడదు. కొన్ని ఆహార పదార్ధాలను పెట్టడం వలన వాటిపై బ్యాక్టీరియా ఏర్పడి అనారోగ్యానికి గురిచేస్తాయి. అందువల్ల రిఫ్రిజిరేటర్లో ఏం పెట్టాలో, ఏం పెట్టకూడదో తెలుసుకుని వాడటం వలన ఎటువంటి ప్రమాదాలకు గురికాకుండా ఉంటారు. కొన్ని పదార్ధాలను రిఫ్రిజరేటర్ లో నిల్వచేయడం వలన వాటి రుచి నాశనం అవుతుంది. అలాగే ఎటువంటి ఆహారాన్ని ఎక్కువ రోజుల పాటు నిల్వ చేయకూడదు. అలా చేయడం వలన కంటికి కనబడని బ్యాక్టీరియా ఏర్పడి అనారోగ్యానికి గురయ్యేలా చేస్తుంది. అసలు ఎలాంటి ఆహారపదార్ధాలు పెట్టకూడదని నిపుణులు అంటున్నారో చూద్ధాం.

1. పుచ్చకాయ

పుచ్చకాయని రిఫ్రిజిరేటర్ లో పెట్టకూడదు. 2006 జరిగిన పరిశోధనల ప్రకారం అమెరికాకి చెందిన వ్యవసాయ విభాగం వారు ఈ విషయాన్ని క్లుప్తంగా తెలియజేసారు. పుచ్చకాయ జాతికి చెందిన పండ్లు అన్నిటినీ రిఫ్రిజిరేటర్ లో నిల్వ చేయడం కంటే గది ఉష్ణోగ్రత వద్ద నిల్వచేయడం చాలా మంచిదని వారు పరిశోధనల ద్వారా నిరూపించారు.

పుచ్చకాయలో యాంటీ ఆక్సిడెంట్స్‌ అధిక మోతాదులో ఉంటాయి. పుచ్చకాయని గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేసినప్పుడు 40 శాతం ఎక్కువ లైకోపీన్‌ మరియు 139 శాతం బీటా కెరోటిన్‌ ఎక్కువగా ఉండటాన్ని పరిశోధకులు గుర్తించారు. ఇవి ఫ్రిజ్‌లో నిల్వచేయడం కంటే బయట గది ఉష్ణోగ్రత వద్ద నిల్వచేయడం వల్ల అధిక మోతాదులో యాంటి ఆక్సిడెంట్స్‌ లభిస్తాయి.

2. టమాటా

ప్రకృతిలో లభించే చాలా సున్నితమైన టమాటాని రిఫ్రిజిరేటర్‌లో పెట్టడం వలన టమాటా రుచితో పాటు ఆకారాన్ని కూడా కొల్పోయి మెత్తగా మారిపోతుంది. చల్లని ఉష్ణోగ్రత వలన టమాటా పైపొర దెబ్బతిని, బాగా మెత్తగా మారిపోతుంది. అంతే కాకుండా చల్లని ఉష్ణోగ్రత వలన పండు పక్వానికి చేరకుండా ఆపుతుంది.

టమాటాని గది ఉష్ణోగ్రత వద్ద నిల్వచేయడం మంచిది. గది ఉష్ణోగ్రత వద్ద తొందరగా టమాటాలు పండుతాయి. టమాటాలను ఒక కాగితం సంచిలో ఉంచి నిల్వచేయడం వలన టమాటాలు తొందరగా పండుతాయి.

బాగా పండిన టమాటాలను రెండు రోజులలో తినేయాలి. అందువల్ల టమాటాలను కోనేటప్పుడు కొంచెం మొత్తంలో కొనుగోలు చేయడం మంచిది. టమాటాలను గది ఉష్ణోగ్రత వద్ద సూర్యరశ్మి తగలకుండా, వాటి కాండం వైపు పైకి ఉంచి నిల్వచేయాలి. గది ఉష్ణోగ్రత 70 డిగ్రీల ఫారన్హీట్ లేదా 21 డిగ్రీల సెల్సియస్‌ సూచిస్తుంది. మీరు బాగా పండిన టమాటాలను ఫ్రిజ్‌లో 2 నుండి 3 రోజుల వరకు నిల్వచేయవచ్చు. అంతకుమించి చేయడం వలన టమాటా కుళ్ళిపోతుంది.

3. బంగాళదుంపలు

బంగాళదుంపలు రిఫ్రిజిరేటర్‌ లో పెట్టడం వలన అది తీపిగా మారిపోతాయి. అంతే కాకుండా అవి రిఫ్రిజిరేటర్‌ లో పెట్టడం వలన తీపిగా చక్కెర పరిమాణాన్ని పెంచి, దుంపలో పండి పదార్ధాన్ని విచిన్నం చేస్తుంది. ఈ బంగాళదుంపని అధిక ఉష్ణోగ్రత వద్ద వేడిచేసినప్పడు అక్రిల్యామైడ్‌ అనే రసాయానాన్ని విడుదల చేస్తుంది. ఇది ఆరోగ్యానికి చాలా హానికరం ఈ రసాయనం తినటం వలన క్యాన్సర్‌ కి గురవుతారు. బంగాళదుంపని వెచ్చని లేదా తేమ ప్రాంతాలలో నిల్వచేసినప్పుడు దుంపలు మెలకెత్తుతాయి లేదా పాడయిపోతాయి. వీటిని చల్లని చీకటి గదిలో నిల్వచేయడం ఉత్తమం. బంగాళదుంపని గాలి తగలకుండా నిల్వ చేయరాదు. వీటిని ప్లాస్లిక్‌ సంచులలో నిల్వచేయడం మానుకోండి.

4. ఉల్లిపాయలు

ఉల్లిపాయలను రిఫ్రిజిరేటర్‌ లో ఉంచకూడదు. తేమకారణంగా ఉల్లిపాయలు బూజు పట్టి పాడైపోతాయి. ఒక వేళ మీరు రిఫ్రిజిరేటర్‌లో ఉల్లిపాయలను ఉంచాలి అనుకుంటే వాటిని ముక్కలుగా కోసి ఏదైనా మూసిఉన్న కంటైనర్‌ లో పెట్టి కొన్ని రోజులు నిల్వచేయవచ్చు. 40 డిగ్రీల ఫారన్హీట్ కంటే తక్కువలో ఉష్ణోగ్రతను పెట్టి నిల్వచేయాలి.

ఉల్లిపాయలను ఎప్పుడూ బాగా గాలి తగిలే ప్రదేశంలో నిల్వచేయాలి. అలాగే పొడిగా, చల్లగా ఉండే ప్రదేశంలో ఉంచడం వలన ఉల్లిపాయలు ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటాయి.

వీటిని ప్లాస్టిక్‌ సంచులో ఉంచడం మంచిది కాదు. అదేవిధంగా ఉల్లిపాయలను బంగాళదుంపతో పాటు కలిపి ఉంచకూడదు. దాని వల్ల త్వరగా పాడవుతాయి.

5. తేనె

తేనెని రిఫ్రిజిరేటర్‌లో నిల్వచేయాల్సిన అవసరం లేదు. అలా అని మీ స్టవ్‌కి దగ్గరలో కూడా ఉంచాలని లేదు. తేనె అతి చల్లని, వేడిమి వలన దాని రుచి కోల్పోతుంది. చల్లని ఉష్ణోగ్రతలలో తేనె ఉంచడం వలన అది క్రిస్టలైస్ గా మారుతుంది. తేనెని గది ఉష్ణోగ్రత వద్ద ఉంచడం వలన తేనె సహజాసిద్దమైన రుచిని కోల్పో కుండా ఉంటుంది. తాజా తేనెను నిల్వచేయడానికి శుభ్రమైన గాలి చొరబడని కంటైనర్‌ లో ఉంచాలి.

తేనెని మెటల్‌ లేదా ప్లాస్టిక్‌ కంటైనర్స్‌లో నిల్వచేయరాదు. అదేవిధంగా సూర్యరశ్మి తగిలే ప్రాంతాలో, బాగా చల్లని ప్రాంతంలో తేనెని నిల్వచేయకూడదు.

6. ఆలివ్‌ ఆయిల్‌

ఆలివ్‌ ఆయిల్‌ వంటకాలలో ఉపయోగిస్తారు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని రిప్రిజిరేటర్‌లో ఉంచకూడదు. ఫ్రిజ్‌లో ఆలివ్‌ ఆయిల్‌ ఉంచడం వలన దాని సహజసిద్ధమైన రుచిని కోల్పోతుంది. అంతేకాకుండా క్లౌడీగా మారిపోతుంది. దీనిని ముదురురంగు కంటైనర్‌ లో వేసి చీకటి అల్మారాలో నిల్వ ఉంచడం ఉత్తమం.

ఆలివ్‌ ఆయిల్‌ని స్టవ్‌ సమీపంలో లేదా వేడి తగిలే భాగంలో ఉంచకూడదు. వేడి తగలడం వలన ఆలివ్‌ ఆయిల్‌ పులిసిపోయినట్లు అవుతుంది. అందువల్ల ఆలివ్‌ ఆయిల్‌ మూత గట్టిగా కలిగిన ముదురురంగు కంటైనర్‌లో వేసి వెలుగు చొరబడని అల్మారాలో నిల్వ చేయాలి. ఇలా చేయడం వలన ఆలివ్‌ ఆయిల్‌ రుచి, వాసన లో ఎటువంటి మార్పు రాదు.

7. వెల్లుల్లి

వెల్లుల్లి పాయ, వెల్లుల్లి రేకులను రిఫ్రిజిరేటర్‌లో ఉంచకూడదు. ఎందుకంటే వెల్లుల్లి పాయలు మెత్తగా మారి పాడయిపోతాయి. వీటిని అతి చల్లని ప్రదేశంలో ఉంచడం వలన రుచిని కూడా కోల్పోతాయి. తాజా వెల్లుల్లిని ముక్కలుగా చేసుకొని గాలి చొరబడని కంటైనర్‌ లో వేసి ఫ్రిజ్‌లో నిల్వచేయవచ్చు. ఇది కేవలం తక్కువ సమయం నిల్వచేయడానికి మాత్రమే ఈ పద్ధతిని అనుసరించాలి.

వెల్లుల్లి పాయలని గాలి తగిలే ప్రదేశాలలో ఉంచడం వలన తాజాగా ఉంటాయి. వంటగది అల్మారాలో ఉంచుకోవచ్చు. వీటిని తొందరగా వాడేయాలి లేకపోతే పాడయిపోతాయి. అందువల్ల తగినంత ఎప్పటికప్పుడు తెచ్చుకోవడం ఉత్తమం. వెల్లుల్లి, రేకులుగా విడుపోయింది అంటే వాటి జీవిత కాలం తొందరగా తగ్గిపోతుంది. వెల్లుల్లిని కొనుగోలు చేసేముందు అవి తాజాగా ఉన్నాయో లేదో చూసుకొని కొనుక్కోవాలి, దానివల్ల ఎక్కువరోజులు నిల్వ చేసుకోవచ్చు.

8. కాఫీ బీన్స్‌

కాఫీ బీన్స్‌ సులభంగా పరిసర ప్రాంతాల నుండి తేమకు గ్రహిస్తాయి. వీటిని ఫ్రిజ్‌లో పెట్టడం వలన ఇవి తేమను పీల్చుకుని బంకగా తయారవుతాయి. అంతే కాకుండా ఫ్రిజ్‌లోని మిగిలిన ఆహార పదార్ధాలకు కూడా కాఫీ వాసన అంటుకుని అన్నీ పదార్ధాలు కాఫీ వాసన వస్తాయి. అందువల్ల వాటిని ఫ్రిజ్‌లో పెట్టకుండా ఉండటం ఎంతోమేలు. కాఫీ బీన్స్‌ని గాలి చొరబడని, సిరామిక్‌ కంటైనర్‌లో వేసుకోవాలి. దీనిని ఎప్పుడు తక్కువ మోతాదులో కొనుగోలు చేసేందుకు ప్రయత్నించండి.

9. బ్రెడ్‌

బ్రెడ్‌ని కూడా రిఫ్రీజిరేటర్‌ లో ఉంచకూడదు. వీటిని చల్లని పొడి ప్రదేశాలలో మాత్రమే నిల్వచేయాలి. సూర్యకాంతికి దూరంగా నిల్వచేయాలి. ప్లాస్టిక్‌ లేదా అల్యూమినియం రేకులో బ్రెడ్‌ని చుట్టి రెండు రోజులు మాత్రమే నిల్వఉంచగలం. బ్రెడ్‌ని ఎప్పటికప్పుడు తాజాగా తినడమే ఆరోగ్యానికి ఎంతో మేలు. సాధ్యమైనంత వరకు తాజా బ్రెడ్‌ నే తినండి.

10. స్టోన్‌ ఫ్రూట్స్‌

రేగు పండ్లు, పీచెస్‌, నేరేడు, చెర్రీస్‌ మెదలగు పండ్లను ఫ్రిజ్‌లో పెట్టడం వలన వీటిరుచిని కోల్పోయి బూజు పట్టి పాడయిపోతాయి. అందువల్ల విత్తనాలు కలిగిన పండ్లను ఫ్రిజ్‌లో పెట్టకూడదు.

ఈ పండ్లుపండిన వెంటనే తినడం మంచిది లేకపోతే తొందరగా పాడైపోతాయి. మార్కెట్‌కి వెళ్ళినప్పుడు తక్కువ మోతాదులో తెచ్చుకొని ఎప్పటికప్పుడు తాజాగా తినడం మంచిది.

చూసారు కదా? ఫ్రిజ్‌లో ఏమి పెట్టకూడదో, ఎందుకు పెట్టకూడదో తెలుసుకున్నారు కదా. తాజా ఆహారాన్ని తింటూ ఆరోగ్యాన్ని సంరక్షించుకోండి.

English summary

Some foods should never refrigerate. Most of us use a refrigerator with little knowledge about the types of food that should be stored in it and what should not.