ప్రత్యూష గురించి రేణు రహస్యాలు

Some interesting facts about Pratyusha Banerjee

10:17 AM ON 11th April, 2016 By Mirchi Vilas

Some interesting facts about Pratyusha Banerjee

ఆత్మహత్య చేసుకున్న హిందీ టీవీ నటి, చిన్నారి పెళ్ళికూతురు ఫేం ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య ఘటనకు సంబంధించి కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. అంత పేరున్న నటి తన ఇంటి పని మనిషి దగ్గర కూడా అప్పులు చేసినట్లు వెల్లడవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ప్రత్యూష చనిపోవడానికి ముందు మూడు నెలల పాటు ఆమె ఇంట్లో పని చేసిన రేణు సిన్హా స్వయంగా ఈ విషయం వెల్లడించింది. ప్రత్యూష.. ఆమె ప్రియుడు రాహుల్ మధ్య సంబంధాల గురించి కూడా పని మనిషి కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించింది. అప్పుడప్పుడు ప్రత్యూష క్యాబ్ ఛార్జీల కోసం.. మందుల కోసం నా దగ్గర డబ్బు తీసుకుంటూ ఉండేది, ప్రత్యూష ఆర్థిక విషయాలన్నీ రాహులే చూసుకునేవాడని..

ఇది కూడా చదవండి: అక్కడ అమ్మాయిలు పరీక్షలయ్యాక ఇష్టమైన వాడితో లేచిపోతారట

ఆమె దగ్గర ఖర్చులకు కూడా పెద్దగా డబ్బులుండేవి కాదు. అప్పుడప్పుడు అర్ధరాత్రి సమయాల్లో ప్రత్యూష-రాహుల్ గది నుంచి అరుపులు వినబడుతుండేవి. వాళ్లిద్దరూ తరచూ గొడవ పడుతుండేవారు. నేను చాలాసార్లు వారిని అడ్డుకోవాలని చూసినా, వ్యక్తిగత విషయాల్లో తలదూర్చకూడదనే ఉద్దేశంతో ఆగిపోయే దాన్ని' అని పనిమనిషి రేణు చెప్పింది. అయితే, రాహుల్ ఇంటి నుంచి బయటకు వెళ్లాక గొడవ గురించి ప్రత్యూష చెప్పేదని.. తన మాజీ బాయ్ ఫ్రెండ్ గురించి రాహుల్ ప్రస్తావించి, వేధించేవాడని ప్రత్యూష చెప్పుకుని బాధపడిందని రేణు వెల్లడించింది. ఇక రాహుల్ చేతిలో ప్రత్యూష దెబ్బలు తిన్న సందర్భాలు చాలానే ఉన్నాయట.

ఇది కూడా చదవండి: గుడిలోనే రాసలీలలు.. అడ్డంగా దొరికిన ఉద్యోగి(వీడియో)

సినిమా.. షాపింగ్ లాంటి చిన్న చిన్న కోరికల విషయంలో కూడా ప్రత్యూషకు రాహుల్ ఆంక్షలు విధించేవాడట. రాహుల్ మాజీ గర్ల్ ఫ్రెండ్ అప్పుడప్పుడు ఇంటికొచ్చి ప్రత్యూషను దుర్భాషలాడేదట..' అయినా రాహుల్ తో ప్రత్యూష బంధాన్ని కొనసాగించడానికే నిర్ణయించుకుంది. పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడల్లా రాహుల్ వాయిదా వేసేవాడు. దీంతో ఆమె మానసికంగా కుంగిపోయేది' అని రేణు వివరించింది.

ఇది కూడా చదవండి: వ్యభిచారిగా మారిన టీచర్

English summary

Some interesting facts about Pratyusha Banerjee. Pratyusha Banerjee house servant Renu tells the secrets of Pratyusha life.