ఇంతకీ రమ్య కృష్ణ వయసు ఎంత ?

Some Interesting Facts About Ramya Krishnan On Her Birthday

01:28 PM ON 16th September, 2016 By Mirchi Vilas

Some Interesting Facts About Ramya Krishnan On Her Birthday

నటి రమ్యకృష్ణ తన పుట్టినరోజు వేడుకలను గురువారం కుటుంబ సభ్యుల మధ్య ఆనందంగా జరుపుకొంది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా తెలిపారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన అభిమానులకు, శ్రేయోభిలాషులకు ఫేస్ బుక్ ద్వారా ధన్యవాదాలు తెలిపింది ఈ సందర్భంగా తన భర్త కృష్ణవంశీ, కుమారుడు తదితరులతో కలిసి కేక్ కట్ చేస్తున్నప్పుడు తీసిన ఫొటోను పోస్ట్ చేసింది. రమ్యకృష్ణ ప్రస్తుతం జాగ్వార్ , బాహుబలి: ది కన్ క్లూజన్ , శభాష్ నాయుడు తదితర చిత్రాల్లో నటిస్తున్న రమ్యకృష్ణ గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

1/18 Pages

13ఏళ్లకే హీరోయిన్ గా ...

ప్రముఖ తమిళ హాస్యనటుడు చో రామస్వామికి మేనకోడలు అయిన రమ్యకృష్ణ చెన్నైలో జన్మించింది. చిన్నతనం నుంచే భరతనాట్యం, కూచిపూడి, పాశ్చాత్య నృత్యాల్లో శిక్షణ పొందారు. అంతేకాకుండా పలు ప్రదర్శనలు కూడా ఇచ్చారు. నృత్య కళాకారిణి కావడం, సినీ నేపథ్యం ఉండటం తొలి అవకాశం తేలికగానే వచ్చింది. మమ్ముట్టి, మోహన్ లాల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన నేరమ్ పాల్ రంబోల్ అనే మలయాళ చిత్రంలో తొలిసారి రమ్యకృష్ణ నటించింది. అప్పటికి ఆమె వయసు 13 ఏళ్లు. అయితే ఆ సినిమా విడుదల ఆలస్యమైంది. ఈలోగా తమిళంలో వై.జి.మహేంద్రతో కలిసి నటించిన వెళ్లాయ్ మనసు(1985) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

English summary

Ramya Krishnan was know for her Glamour show and she was one of the top heroine in those days. Today Ramya Krishnan's birthday and here are some of the interesting facts about Birthday Girl Ramya Krishna.