జుట్టు నష్టం మీద పోరాటం చేసే విటమిన్స్

Some Vitamins That Fight Hair Loss

12:38 PM ON 27th February, 2016 By Mirchi Vilas

Some Vitamins That Fight Hair Loss

అందమైన, పొడవైన జుట్టు కావాలని అందరూ కోరుకుంటారు. కానీ మధ్య వయస్సు వారిలో జుట్టు నష్టం సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ సమస్యలు ఒత్తిడి, అనారోగ్యం, ఆహారం, సూర్యరశ్మి, స్టైలింగ్ కోసం రసాయన చికిత్సల కారణంగా వస్తున్నాయి. పెరుగుతున్న వయస్సుతో పాటు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటే జుట్టు నష్టాన్ని నివారించవచ్చు. మన రోజువారీ ఆహారంలో విటమిన్స్ ఉండేలా చూసుకుంటే జుట్టు పటిష్టంగా ఉండటమే కాక  జుట్టు పతనాన్ని కూడా నివారించవచ్చు.

1/6 Pages

1. విటమిన్ బి

విటమిన్ B3, విటమిన్ B5, బి 12 మరియు విటమిన్ B6 జుట్టు పతనాన్ని నివారించి ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. విటమిన్ B3 జుట్టు పెరుగుదలకు సహాయపడే రక్త ప్రసరణను ప్రోత్సహిస్తుంది. పిండిపదార్ధాలు మరియు ప్రోటీన్లను శక్తిగా మార్చటానికి విటమిన్ B5 సహాయపడుతుంది. ఇతర కణాలతో పోలిస్తే జుట్టు కణాలకు శక్తి ఎక్కువ అవసరం. అందువల్ల విటమిన B5 లోపం ఉంటే జుట్టు పతనానికి దారి తీస్తుంది. విటమిన్ B6 తల మీద చర్మంతో సహా శరీరంలోని అన్ని బాగాలకు ఆక్సిజన్ సరఫరా అవటంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. అందువలన  విటమిన్ B సమృద్దిగా ఉన్న అరటిపళ్లు, తోటకూర, ఆస్పరాగస్, ఆకుపచ్చ బటానీలు, బొప్పాయి మరియు కాయధాన్యాలు, తృణధాన్యాలు వంటి వాటిని ఆహారంలో బాగంగా చేసుకోవాలి.

English summary

Here is Some Vitamins That Fight Hair Loss. Repair and prolong the life of your hair by knowing what vitamins in your daily food can keep up the health of your strands. To fortify your hair and fight hair fall, incorporate these vitamins in your diet.