లేడీస్ బాత్ రూమ్ కి కన్నం పెట్టి.. ఆపై వీడియో తీసి..

Somebody put a hole to ladies bathroom and taken video

03:19 PM ON 2nd September, 2016 By Mirchi Vilas

Somebody put a hole to ladies bathroom and taken video

మహిళలకు భద్రత కల్పిస్తామని చెప్పడమే గానీ వాస్తవంగా అది జరగడం లేదు. పైగా దాడులు, అత్యాచారాలు పెరిగిపోయాయి. ఆడవాళ్లకు దేశంలో నెలకొన్న అభద్రతా పరిస్థితులకు ఈ ఘటన మరోసారి అద్దం పడుతోంది. కాలేజీ అమ్మాయిలకు రోడ్ల పైనే కాదు క్యాంపస్ లోనూ రక్షణ లేకుండా పోతుందని తాజాగా మంగళూరులో జరిగిన ఈ ఘటన రుజువు చేస్తోంది. ఉన్మాదుల పైశాచిక చర్యలకు సాక్ష్యం ఇది. మంగళూరు యూనివర్సిటీలో విద్యార్థినులు కాలకృత్యాలు తీర్చుకునే వాష్ రూమ్ లో గత నెల 24న ఊహించని ఘటన జరిగింది. కాలకృత్యాలు తీర్చుకునేందుకు టాయిలెట్ రూమ్ కు వెళ్లిన ఓ యువతి అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి షాకైంది.

వాష్ రూమ్ రూమ్ కు కన్నం ఉండటాన్ని గమనించింది. యాజమాన్యానికి ఈ సంగతి తెలియజేసింది. చైర్మన్ వచ్చి పరిశీలించగా.. ఆ హోల్ లో ఓ సెల్ఫోన్ దొరికింది. దీంతో యాజమాన్యం, అక్కడున్న విద్యార్థినులు అవాక్కయ్యారు. ఆ ఫోన్ లో సిమ్ కార్డ్ లేదు. కానీ ఆ సెల్ ఫోన్ లో విద్యార్థినుల అసభ్యకర దృశ్యాలు రికార్డయ్యాయి. ఒక్కరూ ఇద్దరూ కాదు, ఎంతో మంది యువతులు వాష్ రూమ్ లో కాలకృత్యాలు తీర్చుకుంటుండగా గుర్తుతెలియని దుండగులు సన్నివేశాలను చిత్రీకరించారు. యాజమాన్యం ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆ సెల్ ఫోన్ ను సీజ్ చేశారు. సెక్యూరిటీ విషయంలో యాజమాన్యం వైఖరిని విద్యార్థులు తప్పుబడుతున్నారు. ఎవరో వచ్చి లేడీస్ టాయిలెట్స్ దగ్గర వీడియోలు తీస్తున్నా గుర్తించలేని స్థితిలో సెక్యూరిటీ సిబ్బంది ఉండటం సిగ్గుచేటని విమర్శిస్తున్నారు. ఇక నెటిజన్లు అయితే వీరలెవెల్లో దుమ్మెత్తి పోస్తున్నారు.

ఇది కూడా చదవండి: ఎవరూ నమ్మలేని భయంకర విషయాలు

ఇది కూడా చదవండి: భార్యకి కడుపు రావడం లేదని పక్కింటి వాడి మీద కేసు పెట్టాడు.. ఎందుకో తెలిస్తే మతిపోతుంది!

ఇది కూడా చదవండి: సంగీత ప్రియులు మనసు దోచే విభిన్న సంగీత వాయిద్యాలు!

English summary

Somebody put a hole to ladies bathroom and taken video