తండ్రిని ముక్కలు చేసి, విసిరేశాడు!

Son cuts his father into pieces for property

10:53 AM ON 1st June, 2016 By Mirchi Vilas

Son cuts his father into pieces for property

ఆస్థి కోసం కన్నవాళ్ళను సైతం మట్టుబెట్టే ప్రబుద్ధులు పెచ్చుమీరుతున్నారు. మానవ బంధాల స్థానంలో ఆర్ధిక బంధాలు పెరిగిపోతున్నాయి. తాజాగా కేరళలో ఓ టెక్కీ ఆస్తి కోసం తన తండ్రిని దారుణంగా కాల్చి చంపాడు. అంతటితో ఆగక.. మృత దేహాన్ని ముక్కలుగా కోసి, శరీర భాగాలను వేర్వేరు చోట్ల పారేశాడు. ఆ రాష్ట్రంలోని చెంగన్నూర్ లో జరిగిందీ ఘటన. వివరాల్లోకి వెళ్తే.. చెంగన్నూర్ ఐటీ హబ్ టెక్నోపార్క్ లో పనిచేస్తున్న 36 ఏళ్ళ షెరిన్ జాన్.. ఇటీవల తన 68 ఏళ్ళ తండ్రి జాయ్ జాన్ ని మర్డర్ చేశాడు. జాయ్ సుమారు 30 సంవత్సరాలుగా అమెరికాలో ఉంటున్నారు.

ఈ మధ్య చెంగన్నూర్ లోని తమ పూర్వీకుల ఇంటిని చూసేందుకు ఆయన వచ్చాడు. అయితే ఏదో పని మీద ఆయనను బయటకు తీసుకువెళ్ళిన షెరిన్.. ఈ దారుణానికి పాల్పడ్డాడు. తన భర్త, కొడుకు కలిసి వెళ్ళారని, కానీ తన భర్త ఇంటికి తిరిగి రాలేదని షెరిన్ తల్లి మరియమ్మ పోలీసులకు మిస్సింగ్ కంప్లయింట్ ఇచ్చింది. పోలీసులు షెరిన్ ను అనుమానించి అతన్ని అరెస్ట్ చేశారు. ఆస్తి కోసమే తన తండ్రిని హత్య చేసినట్టు షెరిన్ అంగీకరించాడు. పోలీసులు ఈ కేసుకు సంబంధించి షెరిన్ చెప్పిన వివరాలమేరకు.. వివిధ ప్రాంతాల్లోని జాయ్ శరీర భాగాలను స్వాధీనం చేసుకుని డీఎన్ఏ టెస్ట్కు పంపారు. కేసు దర్యాప్తు జరుగుతోంది.

English summary

Son cuts his father into pieces for property