రెండు నెలల క్రిందట అత్తను పెళ్లాడిన అల్లుడు.. ఇప్పుడు ఏం చేశారంటే..

Son in law married his mother in law before 2 months

01:07 PM ON 22nd August, 2016 By Mirchi Vilas

Son in law married his mother in law before 2 months

ఈమధ్య బీహార్ లోని మధేపుర జిల్లాలో అత్తాఅల్లుడు పెళ్లి చేసుకున్నారు. ఈ వింత పెళ్లిని పంచాయితీ పెద్దలు కూడా అంగీకరించడం కొసమెరుపు. అయితే బంధానికే మచ్చ తెచ్చే విధంగా వీరు చేసుకున్న పెళ్లి కొద్దిరోజులకే పెటాలకులయింది. తాజాగా ఈ వింత పెళ్లికి సంబంధించిన ఓ విషయం వెలుగులోకి వచ్చింది. తామెంత తప్పు చేశామో తెలిసిందని... తమకు విడాకులు ఇప్పించాలని ఈ అత్తాఅల్లుళ్లు.. అదే, భార్యాభర్తలు కోరడం విశేషం. తాను ఎంత అవివేకపు పని చేశానో ఇప్పటికి తెలిసిందని, తాను తప్పు చేసినట్లు ఒప్పుకుంటున్నానని సూరజ్ చెప్పాడు. భవిష్యత్ లో మళ్లీ ఇలాంటి తప్పు చేయనని తెలిపాడు. తన అత్త ఆశాదేవిని వివాహం చేసుకున్నప్పటికీ ఒక తల్లిగానే చూశాను తప్ప భార్యగా భావించలేదని సూరజ్ చెప్పడం ఇక్కడ అసలు ట్విస్ట్.

తాను చేసిన పనికి కూతురిని క్షమాపణలు కోరతానని, సూరజ్ నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు ఆశాదేవి తెలిపింది. ఈ వింత పెళ్లి జూన్ 1న జరిగింది. ఆశాదేవి కూతురు లలితకు(19), సూరజ్ కు(22) రెండు సంవత్సరాల క్రితం పెళ్లి జరిగింది. ఆశాదేవి అల్లుడు సూరజ్ ను దక్కించుకోవాలనుకుంది. వారి వ్యవహారం కాస్తా శ్రుతిమించి అక్రమ సంబంధం వరకూ వెళ్లింది. కూతురుని చూడాలన్న వంకతో వచ్చిన ఆశాదేవి అల్లుడి ఇంటికి వచ్చి రాసలీలలు సాగించేది. ఆమె మోజులో పడిన సూరజ్, లలితను పట్టించుకోవడం మానేశాడు. ఈ విషయంలో సూరజ్, లలిత మధ్య తరచూ గొడవలు జరిగేవి. అమ్మ లాంటి అత్తతో అక్రమ సంబంధం తప్పని భార్య ఎంత వాదించినా సూరజ్ వినలేదు. చివరకు సూరజ్, ఆశాదేవి పెళ్లి చేసుకుని కుటుంబ సభ్యులకు షాకిచ్చారు.

పంచాయితీ పెద్దలు కూడా పెళ్లికి అంగీకరించారు. అయితే లలితకు ఒక చిన్న బాబు ఉన్నాడు. ఆశాదేవి కన్న కూతురి జీవితంలో నిప్పులు పోసిందని గ్రామస్థులంతా ఆడిపోసుకుంటున్నారు. చేసేదేమీ లేక లలితను ఆమె తండ్రి ఇంటికి తీసుకెళ్లాడు. ఇప్పుడు అత్తాఅల్లుడి బంధం బెడిసికొట్టింది.

English summary

Son in law married his mother in law before 2 months