డ్రైవర్ తో కోడలు అక్రమ సంబంధం అత్తకి తెలిసి ఏం చేసిందంటే..

Son killed his mother for his wife is in illegal affair

01:46 PM ON 4th June, 2016 By Mirchi Vilas

Son killed his mother for his wife is in illegal affair

తమిళనాడులోని ఆర్కాడు తాలూకాలో తిమిరి సమీపంలోని తామరపాక్కం గ్రామానికి చెందిన పూంగావనం (53) అని ఆమెకి రమేష్ అనే కొడుకు ఉన్నాడు. రమేష్ కి ప్రియ అనే యువతితో కొంత కాలం క్రిందట పెళ్లైంది. రమేష్ కూలీ కార్మికుడిగా పని చేస్తున్నాడు. అయితే రమేష్ భార్య ప్రియ అదే గ్రామానికి చెందిన ఓ ట్రాక్టర్ డ్రైవర్తో అక్రమ సంబంధం పెట్టుకుంది. భర్త లేని సమయంలో అతడ్ని ఇంటికి పిలిపించుకుని.. శృంగారంలో పాల్గొనేది. ఈ విషయం రమేష్ కి తెలియడంతో.. దంపతుల మధ్య రోజూ గొడవలు జరిగేవి. దీంతో.. ప్రియ తిరువణ్ణామలై జిల్లా ఆరణిలోని తన పుట్టింటికి వెళ్లిపోయింది.

అయితే కొద్ది రోజులు తరువాత ప్రియని తీసుకురావాలని తన తల్లిని రమేష్ కోరాడు. ట్రాక్టర్ డ్రైవర్ తో అక్రమ సంబంధం ఉందని తనకు ఎప్పటి నుండో తెలుసని.. గొడవలు అవుతాయనే భయంతో చెప్పలేదని పూంగావనం రమేష్ కు చెప్పింది. దీనితో తీవ్ర ఆగ్రహానికి గురైన రమేష్.. కత్తి తీసుకొని ఆమె పై దాడి చేయడంతో.. ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం భార్యని చంపడానికి ఆమె పుట్టింటికి బయలు దేరాడు. స్ధానికుల సమాచారంతో.. పోలీసులు రమేష్ ని అరెస్ట్ చేసారు.

English summary

Son killed his mother for his wife is in illegal affair