1720 రూపాయలకు తల్లిని చంపేసాడు

Son kills mother for money

11:22 AM ON 18th April, 2016 By Mirchi Vilas

Son kills mother for money

సభ్య సమాజంలో రోజు రోజుకూ నేరాలు ఘోరాలు పెరిగిపోతున్నాయి... తాజాగా ఓ తల్లిని కన్న కొడుకే మట్టు బెట్టాడు. దురలవాట్లకు లోనైన ఓ వ్యక్తి డబ్బు కోసం మిత్రులతో కలిసి కన్న తల్లిని దారుణంగా హత్య చేశాడు. పోలీసుల కధనం ప్రకారం, మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలంలోని అప్పాజిపల్లి గ్రామంలో జరిగింది. అప్పాజిపల్లి గ్రామానికి చెందిన శంకురి నర్సమ్మ కుమారుడు శివకుమార్తో కలిసి జీవిస్తోంది. ఎకరన్నర వ్యవసాయ భూమి ఉంది. చిన్న చిన్న దొంగతనాలకు అలవాటు పడ్డ శివకుమార్ ఆదివారం రాత్రి చెరువులో చేపలు పట్టేందుకు వెళ్దామని తల్లిని నమ్మించాడు.

అదే గ్రామానికి చెందిన తలారి పాండుతో కలిసి ఆమెను గ్రామ శివారులోకి తీసుకెళ్లి చీర కొంగుతో తల్లి గొంతుకు ముడివేసి దారుణంగా హత్య చేశారు. సోమవారం ఉదయం తన తల్లి కనిపించడం లేదని ప్రచారం చేశాడు. స్థానికులకు అనుమానం కలిగి అతనిని మందలించగా తల్లి శవం వద్దకు గ్రామస్థులను తీసుకెళ్లి తనకు ఏమీ ఎరగనట్లు, తన తల్లిని ఎవరో చంపారని నమ్మించేందుకు ప్రయత్నించాడు. తాను, పాండుతో కలిసి హత్య చేసినట్లు ముందు ఒప్పుకున్నాడు. తల్లి వద్ద నుంచి 1720 రుపాయలు, బంగారు పుస్తె, వెండి అభరణాలను తీసుకొని డబ్బుల కోసం తల్లిని హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

English summary

Son kills mother for money. Brutal Son killed his mother for money and gold in Medak distict.