బతికుండగానే తల్లిని పాతేసాడు(వీడియో)

Son takes his mother to Funeral when she alive

12:26 PM ON 5th April, 2016 By Mirchi Vilas

Son takes his mother to Funeral when she alive

ఏదో కోపంలో పాతెస్తా, నరికేసి పోగులు పెడతా, చంపేస్తా వంటి మాటలు నోటి వెంట రావడం చాలా చోట్ల చూస్తుంటాం... అయితే ఓ సుపుత్రుడు కన్నతల్లి బతికుండగానే నిజంగా పాతిపెట్టేసాడు. ప్రాణం ఉండగానే కాల యముడయ్యాడు. ఇది జరిగింది ఎక్కడంటే, తెలంగాణాలోని భూపాల పల్లిలో... విషయం తెలిసిన గ్రామస్తులు అతని పై పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో అతడి క్రూరత్వం వెలుగు చూసింది. కన్న కొడుకు చేతిలో ప్రాణాలు కోల్పోయిన భూపాలపల్లి లోని పట్కారి మల్లమ్మకు నలుగురు కొడుకులు ఉన్నారు. భర్త చనిపోవడంతో ఆమె పరిస్థితి తలకిందులైంది.

వృద్ధాప్యంలో ఆదుకోవాల్సిన కొడుకులు వంతుల వారీగా పంచుకున్నారు. నెలకొకరి ఇంట్లో ఉండేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ ఎల్ బి నగర్ లో ఉంటున్న రెండో కొడుకు శ్రీనివాస్ ఇంటికి వచ్చింది. వృద్ధాప్యంతో పాటు అనారోగ్యం కూడా చుట్టుముట్టడంతో కూతుళ్ళు, బంధువులు వచ్చి చూసి వెళుతున్నారు. అయితే ఆమె కోలుకుంటే ప్రమాదమని భావించాడో ఏమో గానీ తల్లిని ఓ గుడ్డలో మూట గట్టి స్మశానానికి తీసుకెళ్ళాడు. గొయ్యి తీసు పాతేసాడు ఆ కర్కోటకుడు...


English summary

Son takes his mother to Funeral when she alive. Son killed his mother brutally in Warangal, Bhupalapalli.