సల్మాన్ ని ఉతికి ఆరేసిన లేడీ సింగర్

Sona Mohapatra blames Salman Khan

11:40 AM ON 23rd June, 2016 By Mirchi Vilas

Sona Mohapatra blames Salman Khan

అత్యాచారం వ్యాఖ్యలతో వివాదంలో ఇరుక్కున్న బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ పై గాయని సోనా మహాపాత్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సల్మాన్ వ్యాఖ్యలను ఆమె ఖండించారు. అంతేకాదు, ఆయనకు మద్దతిస్తున్న అభిమానుల పైనా నిప్పులు చెరిగారు. సుల్తాన్ సినిమా షూటింగ్ తర్వాత తన పరిస్థితి అత్యాచారానికి గురైన మహిళలా అయిందని కండల వీరుడు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఓ పక్క సల్మాన్ తండ్రి స్వయంగా రంగంలో దిగి కొడుకు తరపున క్షమాపణ చెప్పినా, మరోపక్క ట్విట్టర్ లో సల్మాన్ కు మద్దతుగా పోస్ట్ లు చేస్తున్న వారిని ఉద్దేశిస్తూ..

మహాపాత్ర మహిళలను తోసేయ్యడం, హిట్ అండ్ రన్, వన్యప్రాణులను వేటాడిన వ్యక్తిని హీరో అని పొగిడేవాళ్లు దేశం నిండా ఉన్నారు అని చురకలు అంటిస్తూ, ట్వీట్ చేశారు. అయితే, పలువురు నెటిజన్లు మహాపాత్రను విమర్శిస్తూ ట్వీట్లు చేయడంతో మహాపాత్ర ధీటుగా స్పందించారు. సల్మాన్ అభిమానులను భాయ్ చంచాలు అని సంభోదిస్తూ మీ చెత్త మెసేజ్ లతో నేను చేసిన ట్వీట్లు సరైనవే అని నిరూపించారు అంటూ మహాపాత్ర మరో ట్వీట్ చేశారు. తనని 40 ఏళ్ల ఆంటీ అంటున్నారని, మరి సల్మాన్ 50ఏళ్ల బాలుడా అంటూ ఆమె ఎటాక్ ఇచ్చారు. అభిమానులకు మంచిగా ఉండమని చెప్పండి.

ప్రతి రోజు మీ తండ్రి క్షమాపణలు చెప్పుకొనేలా చేయడం మంచిది కాదు అని హితవు పలుకుతూ ట్వీట్ల వర్షం కురిపించారు. మరి అభిమానులు తట్టుకోగలరో లేదో.

English summary

Sona Mohapatra blames Salman Khan