‘అకిరా’తో ఆ కోరిక తీరడం ఖాయం

Sonakshi About Akira Movie

10:12 AM ON 16th February, 2016 By Mirchi Vilas

Sonakshi About Akira Movie

తొలి చిత్రం ‘దబాంగ్‌’తో హొయలు ఒలికించడం తో పాటూ నటన పాళ్ళు కూడా బాగుండడంతో మంచి నటి అనిపించుకున్న సోనాక్షీ సిన్హా కి ఓ కోరిక ఉండిపోయింది. కొంతకాలంగా ఎదురు చూస్తున్న ఆ కోరిక త్వరలోనే తీరుతుందని సిన్హా ధీమాగా చెబుతోంది. అదికూడా ‘అకిరా’ చిత్రం తోనేనని అంటోంది. ఈ భామ ‘లూటెరా’ లాంటి మంచి చిత్రంతో నటిగానూ బెస్ట్ మార్కులు కొట్టేసినా, ఉత్తమ హీరోయిన్ పురస్కారం మాత్రం ఇంకా దరి చేరలేదు. ఎందుకంటే అలాంటి పురస్కారం వస్తే ఆ కిక్కే వేరు కదా. ఓ విధంగా కొంత నిరుత్సాహం గా వున్నా, ‘దబాంగ్‌’లో ఉత్తమ తొలి చిత్రనాయికగా అందుకున్న పురస్కారం మాత్రం కొంత సంతృప్తిని మిగిల్చింది. అయితే ఇప్పుడు ‘అకిరా’తో బెస్ట్ హీరోయిన్ పురస్కారం పక్కా గా అందుకుంటానని సోనాక్షీ చెబుతోంది. మరి ఈమె కోరిక తీరాలని ఆశిద్దాం.

English summary

Bollywood Heroine Sonakshi Sinha who was maee her debut in Salman Khans Super Hit Film Dabang Movie.Recently she was acting in "Akira" movie in which she played a lead role in the movie.She says that she will definitely win Best Heroine Award for this movie.