అందులో గిన్నిస్‌ రికార్డ్‌ కెక్కిన సోనాక్షి 

Sonakshi Sinha climbed guinness record

10:03 AM ON 10th March, 2016 By Mirchi Vilas

Sonakshi Sinha climbed guinness record

అవును, నిజం ఆ విషయంలో బాలీవుడ్‌ కథానాయిక సోనాక్షీ సిన్హా గిన్నీస్ రికార్డు సాధించేసింది. ఎవరైనా వెరైటీ పనిచేస్తే, గిన్నీస్ రికార్డుకి ఎక్కించాలి అంటూ కామెంట్ చేస్తాం. అయితే అది నిజంగానే సొంతం చేసుకుంది సోనాక్షి. అదేమిటంటే, అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు ఓ సౌందర్య సాధనాల సంస్థ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమం గిన్నిస్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకొంది. మరి దాన్ని నిర్వహించిన సోనాక్షి రికార్డు జ్ఞాపిక అందుకొంది. వివరాల్లోకి వెళితే, ముంబయిలో ఈ నెల 8న జరిగిన ఈ కార్యక్రమంలో 1328 మహిళలు ఒకే చోట చేరి గోళ్లకు రంగేసుకున్నారు. ఆ ఫీట్‌ మెచ్చిన గిన్నిస్‌ బుక్‌వారు రికార్డ్‌ కూడా ఇచ్చేశారు.

గతంలో ఈ రికార్డు 1156 మందితో నిర్వహించిన ఘనత ఓ కార్యక్రమానికి ఉంది. 2011 ఏప్రిల్‌ 27న తైవాన్‌లో కొంతమంది ఔత్సాహికులు కలసి గోళ్లకు రంగేసుకొని రికార్డు సాధించారు. దాన్ని సోనాక్షి అండ్‌ టీమ్‌ ఇప్పుడు బద్దలుకొట్టింది. మొత్తానికి ఏదో ఒకటి చేసి గిన్నీస్ రికార్డు కొట్టేసింది ఈ బాలీవుడు భామ.

English summary

Sonakshi Sinha climbed guinness record on women's day.