అమ్మో అది అడిగితే కోపం రాదా మరి?

Sonakshi Sinha Fires On Her Fan On Twitter

12:49 PM ON 10th February, 2016 By Mirchi Vilas

Sonakshi Sinha Fires On Her Fan On Twitter

ఫేస్‌బుక్‌... ట్విట్టర్‌ లాంటి సోషల్ మీడియాలో అభిమానులు అడిగిన ప్రశ్నలకు తారలు సమాధానమివ్వడం ప్రస్తుత ట్రెండ్‌. కానీ అలా అడిగితే బాలీవుడ్‌ అందాల భామ సోనాక్షి సిన్హా ఆగ్రహంతో ఊగిపోయింది. ఇంతకీ ఆమెకు అంతగా కోపం తెప్పించిన ప్రశ్న ఏమిటి ? ట్విట్టర్‌ లో అభిమానులతో ముచ్చటిస్తున్న ఈ భామని ‘‘మీ ఒంపు సొంపులు మాకెప్పుడు చూపిస్తారు... మీరు బికినీలో ఎప్పుడు కనిపిస్తారు?’’అని అడిగాడట. దీంతో కోపం చిర్రెత్తు కొచ్చిన సోనాక్షి ‘‘ఇదే మాట మీ కుటుంబంలోని ఆడవాళ్లను అడుగు... సమాధానం నీకే తెలుస్తుంది’’అంటూ ఘాటుగా స్పందించింది. అంతేకాకుండా కొద్దిసేపటికే ఆ ట్వీట్లను తొలిగించేసి కొత్త ట్వీట్‌ చేసింది. ‘‘అతడు నాకు క్షమాపణలు చెప్పాడు. అందుకే ఆ ట్వీట్లు తొలగించాను. ఏ రంగంలో ఉన్న మహిళలనైనా గౌరవించాలనే విషయం ఇకనైనా ఇలాంటివాళ్లు తెలుసుకోవాలి’’అని అంటోంది సోనాక్షి. ఇంతకీ బికినీలో నటించదా... ఏంటి? అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.

English summary

Bollywood Heroine Sonakshi Sinha fires on a fan on twitter.A fan in twitter asked sonakshi that " when she was wearing a bikini".Sonakshi replied him that Ask your mum or sister this same question.Later Sonakshi deleted this post from twitter by saying that he said apolozy to her.