సైజ్‌జీరో అందాలు ఒలకబోసింది

Sonal Chauhan exposed heavily in Size Zero movie

06:11 PM ON 25th November, 2015 By Mirchi Vilas

Sonal Chauhan exposed heavily in Size Zero movie

టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌ అనుష్క ఇటీవలే బాహుబలి, రుద్రమదేవి చిత్రాలతో సూపర్‌హిట్‌ అందుకుంది. అనుష్క నటించిన తాజా చిత్రం 'సైజ్‌జీరో' ఇందులో అనుష్క పాత్ర కోసం ఏకంగా 20 కేజీలు బరువు పెరిగి సినిమా పై తనకున్న ఇష్టాన్ని తెలియజేసింది. ఈ చిత్రాన్ని నవంబర్‌ 27 న తెలుగు, తమిళ భాషల్లో కలిపి ప్రపంచవ్యాప్తంగా 1500 ధియేలర్లలో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలో అనుష్క ది బొద్దుగా ఉన్న పాత్ర కాబట్టి అందాలు ఆరబోసే ఛాన్స్‌లేదు. అందుచేత ఇందులో మరో పాత్రలో టాలీవుడ్‌ సెక్సీ హీరోయిన్‌ 'సోనాల్‌ చౌహాన్‌' ముఖ్యపాత్రలో నటిస్తుంది.

ఇందులో తను ఒక ఎన్నారై అమ్మాయిగా, మోడ్రన్‌గా హాట్‌హాట్‌ లుక్స్‌తో దర్శనమిస్తుందట. సోనాల్‌ అందాలు చూపించడంతో పాటు తన పాత్రతో కామెడీ కూడా బాగా పంచుతుందట. ఈ చిత్రంలో తమిళ స్టార్‌ ఆర్య హీరోగా నటించాడు. కె.రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్‌ కోవెలమూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

English summary

Sonal Chauhan exposed heavily in Size Zero movie which was directed by Prakash Kovelamudi.