సోనాల్‌ ఆశలు డిక్టేటర్‌పైనే..

Sonal Chauhan hopes on Dictator

07:34 PM ON 17th November, 2015 By Mirchi Vilas

Sonal Chauhan hopes on Dictator

రెయిన్‌బో చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన ఢిల్లీ ముద్దుగుమ్మ సోనాల్‌చౌహన్‌. ఆ సినిమా ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో బాలీవుడ్‌కి మఖాం మార్చింది. సోనాల్‌ అక్కడ అడపాదడపా సినిమాలు చేసింది. 2014లో సూపర్‌హిట్‌ అయిన లెజెండ్‌ చిత్రంతో మళ్ళీ టాలివుడ్‌లో రీఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రంలో బికినీ వేసి కుర్రకారు మతి పోగొట్టింది. ఆ తరువాత వరుసగా ఆఫర్లు వచ్చి పడ్డాయి. పండగచేస్కొలో అందాలు ఆరబోసింది. దానితో కల్యాణ్ రామ్తో 'షేర్‌' సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్‌ కొట్టింది. అది ఫ్లాప్‌ అవ్వడంతో సోనాల్‌చౌహన్‌ బాలయ్య నటిస్తున్న డిక్టేటర్‌ సినిమాపైనే ఆశలు పెట్టుకుంది. ఇది హిట్టైతే మరిన్ని అవకాశాలు వస్తాయని ఆశిస్తుంది.

English summary

Sonal Chauhan hopes on Dictator