ఈ అమ్మడు బంగారం ఉష్ కాకి!

Sonal Chauhan lost her gold bag

02:51 PM ON 6th July, 2016 By Mirchi Vilas

Sonal Chauhan lost her gold bag

ఒక్కో టైం ఒక్కొక్కరికి కలిసి వస్తుంది. అందుకే అంటారు ఒక్కోసారి కష్టపడకపోయినా వచ్చేవి వచ్చేస్తుంటాయి. ఒక్కోసారి ఎంత కష్టపడ్డా ఫలితం అనుకున్న స్థాయిలో ఉండదు. సరిగ్గా అదే కోవలో సెక్సీ హీరోయిన్ సోనాల్ చౌహాన్ కి జరిగింది. కానీ వెనువెంటనే మరో విషాదం అలుముకుంది. ఎప్పుడు ఎన్నిసార్లు బికినీ వేసినా రాని బ్రేక్.. బాలయ్యతో లెజెండ్ సినిమాలో బికినీ అందాలు చిందించగానే ఈ అమ్మడుకి అమాంతం రేంజ్ వచ్చేసింది. ఆ దెబ్బతో చేతిలో అరడజను సినిమాలు వచ్చిపడ్డాయ్. అయితే, ఈ అమ్మడు మాత్రం వాటిని క్యాష్ చేసుకోలేకపోయింది. ఇక ఇప్పుడు తన ఫ్యామిలీ వారిచ్చిన జ్యూయలరీ పోయాయంటోంది.

ఇంతకీ ఏం జరిగిందంటే.. మొన్న సైమా 2016 అవార్డుల వేడుకలో పాలుపంచుకోవడానికి సోనాల్ చౌహాన్ సింగపూర్ వెళ్లింది. అయితే అక్కడ ఫ్యాషనబుల్ డ్రస్సుల మీద వేసుకోవడానికి ముంబై నుండి చాలా జ్యూయలరీ మోసుకుంటూ వెళ్లిందట. కానీ సింగపూర్ హోటల్లో ఆ జ్యూయలరీ బ్యాగ్ ఎక్కడో మిస్ అయిపోయింది అని ఈ అమ్మడు చెబుతోంది. అందుకే మొన్న ఈవెంట్ లో వేరే జ్యూయలరీ వేసుకుందట. ఇప్పుడు తన మిస్సయిన బ్యాగ్ ఎవరైనా తెచ్చిస్తే బాగుండునని ఎదురుచూస్తోంది. త్వరలోనే ఎవరైనా తిరిగి ఇవ్వకపోతారా అంటూ సోనాల్ ఆశ పడుతోంది. ఇలా ఎదురు చూడడం వరకూ బానే ఉంది.

కానీ ఈ అమ్మడు బ్యాగ్ లో ఉన్నవి గోల్డా? రోల్డ్ గోల్డా? అనే అనుమానం అందరిలో వ్యక్తం అవుతోందట. ఒకవేళ గోల్డ్ అయితే మాత్రం తిరిగి రావడం కలే అవుతుందని సినీ లవర్స్ అంటున్నారు. మొత్తానికి భలే జరిగిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

English summary

Sonal Chauhan lost her gold bag