బాలయ్యను పొగిడేస్తున్న హీరోయిన్‌

Sonal Chouhan Praises BalaKrishna

01:03 PM ON 1st December, 2015 By Mirchi Vilas

Sonal Chouhan Praises BalaKrishna

బాలీవుడ్లో హీరోయిన్‌గా అరంగేట్రం చేసిన సోనాల్‌ చౌహన్‌ కు బాలీవుడ్లో అనుకున్నంత స్థాయిలో గుర్తింపు రాలేదు. దీంతో హిందీలో అవకాశాలు లేని టైంలో దక్షణాది సినిమాల్లో బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన 'లెజెంట్‌' మూవిలో బాలకృష్ణ సరసన నటించే అవకాశం వచ్చింది . బాలయ్య మూవీ కాస్త సూపర్‌హిట్‌ కావడంతో తెలుగు సినిమాల్లో సోనాల్ చౌహాన్ కు అవకాశాలు వెల్లువగా వచ్చి పడ్డాయి. ఎనర్జిటిక్‌ హీరో రామ్‌ సరసన' పండగచేస్కో' సినిమాతో మరోహిట్‌ కొట్టి తెలుగు టాలివుడ్‌ లో బిజీబిజీగా మారిపోయింది సోనాల్‌చౌహన్‌.

ఇదిఇలా ఉండగా బాలయ్య తదుపరి చిత్రం 'డిక్టేటర్‌' లో నటించమని సోనాల్‌ను సంప్రదించగా వేరే ఆలోచన లేకుండా ఠక్కున ఓకే చెప్పేసింది సోనాల్‌. సోనాల్‌ మాట్లాడుతూ బాలయ్య లేకపోతే తనకి టాలీవుడ్‌ లో స్థానం లేదని,బాలకృష్ణ అవకాశం ఇవ్వడం వల్లనే ఇప్పుడు తాను టాలీవుడ్‌లో రాణిస్తున్నానని చెప్పింది. అంతేకాక బాలయ్య కు తాను జీవితాంతం రుణపడి ఉంటానని సోనాల్‌చౌహన్‌ చెప్పుకొచ్చింది. సోనాల్‌ బాలయ్యను పొగుడుతూ బాలయ్య అందరు అనుకునేంత సీరియస్‌గా ఉండరని,బాలయ్య చాలా సరదాగా ఉంటారని చెప్పుకొచ్చింది. బాలయ్యతో మంచిగా ఉంటే బాగానే ఉంటుందని సెలవిచ్చింది ఈ బామ.

English summary

Hot Actress Sonal Chouhan praises Bala Krishna . Sonal says that bala krishjna is very cool person. Sonal Is also acting in bala krishna's new film Dictator