అది చెప్పడానికి సిగ్గుపడను..

Sonam Kapoor age was 31 years

11:56 AM ON 10th June, 2016 By Mirchi Vilas

Sonam Kapoor age was 31 years

నీర్జా తన మీద బాధ్యత పెంచిందని.. అందుకే ఒక పట్టాన కొత్త సినిమాలేవీ ఒప్పుకోవట్లేదని చెప్పిన సోనమ్ కపూర్.. ఈ నెల 11న తన కొత్త సినిమాను అనౌన్స్ చేస్తానని.. అది ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అంటోంది. 2007లో సావరియా సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన అనిల్ కపూర్ తనయ.. ఆ తర్వాత బోలెడన్ని గ్లామర్ రోల్స్ చేసి చేసి అలసిపోయి.. ఈ మధ్యే నీర్జా సినిమాతో నటిగా తనేంటో నిరూపించుకుని సక్సెస్ కూడా అందుకుంది. ఇక మగాడి జీతం.. ఆడవాళ్ల వయసు చెప్పకూడదంటారు. అందులోనూ సినిమా హీరోయిన్లయితే ఈ విషయంలో అస్సలు బయటపడరు. మామూలుగానే హీరోయిన్ల తమ వయసు గురించి మాట్లాడరు.

అలాంటిది 30 ప్లస్ లో పడ్డాక చెప్పాల్సిన పనే ఉండదు. కానీ సోనమ్ కపూర్ మాత్రం తన వయసు గురించి మొహమాటం లేకుండా చెప్పేసింది. గురువారం నాడు తన పుట్టిన రోజు జరుపుకున్న ఈ హాట్ యాక్ట్రెస్.. ట్విట్టర్లో తన వయు 31 అని ప్రకటించింది. ఈ విషయం చెప్పడానికి తనకేమీ సిగ్గుగా లేదని ఆమె చెప్పింది. నేను 31వ పడిలో పడ్డా. నా వయసు చెప్పుకోవడానికి నాకేమీ సిగ్గుగా లేదు. ప్రతి కొత్త సంవత్సరం నాకు సంతోషాన్నిస్తోంది. నేను ప్రతి ఏడాది ఎదుగుతూనే ఉన్నా. మంచేంటి చెడేంటి అని చూడకుండా ఆ క్షణం ఆస్వాదించడమే నా పని అని సోనమ్ తన పుట్టిన రోజు సందర్భంగా ట్వీట్ చేసింది.

గత పుట్టిన రోజుకు.. ఈ పుట్టిన రోజుకు నీర్జా అనే మరపురాని సినిమా చేశానని.. కాబట్టి ఈ పుట్టిన రోజు తనకు చాలా స్పెషల్ అని సోనమ్ అంటోంది. దటీజ్ సోనమ్ అంటున్నారు అభిమానులు.

English summary

Sonam Kapoor age was 31 years