359 మంది ప్రాణాలు 'సోనమ్‌కపూర్‌' చేతుల్లో...

Sonam kapoor Neerja Trailer

02:45 PM ON 18th December, 2015 By Mirchi Vilas

Sonam kapoor Neerja Trailer

పాన్‌ అమెరికన్‌ ఎయిర్‌ వేస్‌కు చెందిన ఫ్లైట్ అంటెండంట్‌ 'నీర్జా భానోట్‌' కథ ఆధారంగా తెరకక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ స్టైలిష్‌ ఐకాన్ సుందరి సోనమ్‌కపూర్‌ నీర్జా పాత్రలో నటిస్తుంది. 1986లో కరాచీ నుంచి బయల్దేరిన ఒక విమానాన్ని, అబునిదాల్‌ సంస్ధకు చెందిన ఉగ్రవాదులు ఆ విమానాన్ని హైజాక్‌ చేస్తారు. అప్పుడు 23 సంవత్సరాలు గల నీర్జా ఆ విమానంలో ఉన్న 359 మంది ప్రాణాలను కాపాడి తాను ప్రాణత్యాగం చేస్తుంది. 29 సంవత్సరాల క్రిందట జరిగిన ఈ సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ నీర్జా చిత్రం ట్రెలర్‌ విడుదలయింది.

ఈ ట్రైలర్ చూస్తుంటే నీర్జా పాత్రలో సోనమ్‌ కపూర్‌ సరిగ్గా ఒదిగిపోయింది. ఒక గతాన్ని కళ్లకు కట్టినట్లు ఈ ట్రైలర్ చూపిస్తుంది అనడంలో అతిశయోక్తి లేందటే ఈ చిత్రాన్ని 'రామ్‌ మద్వాని' అంత గొప్పగా తెరకెక్కించారు. 2016 ఫిబ్రవరి 19న విడుదలవుతున్న ఈ చిత్రం ట్రైలర్ను మీరూ వీక్షించండి.


English summary

Sonam kapoor Neerja Trailer.