'బాహుబలి'లో నటించడానికి నో చెప్పిన స్టార్ హీరోయిన్!

Sonam Kapoor rejected act in Baahubali movie

03:12 PM ON 15th October, 2016 By Mirchi Vilas

Sonam Kapoor rejected act in Baahubali movie

జనాల్లో ఇంకా 'బాహుబలి' ఫీవర్ తగ్గనే లేదు. అందుకు కారణం లేకపోలేదు. 'బాహుబలి' చిత్రం విడుదలై సంచలన విజయం సాధించి.. ప్రపంచవ్యాప్తంగా భారత చిత్ర పరిశ్రమ ఖ్యాతిని చాటింది కదా. అయితే ఇలాంటి సినిమాలో నటించే అవకాశం కోసం దాదాపు అందరు నటీనటులు ఎదురుచూస్తుంటారు. అయితే ఈ చిత్రంలోని రమ్యకృష్ణ పాత్రలో నటించేందుకు శ్రీదేవి నిరాకరించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా విజయాల నమోదు మాదిరిగానే ఇంకా ఎన్నో రహస్యాలు ఒక్కొక్కటి వెలుగు చూస్తున్నాయి. తాజాగా మరో విషయం వెలుగుచూసింది. అదేమిటంటే శ్రీదేవే కాదు, మరో నటి కూడా బాహుబలిలో నటించేందుకు ఒప్పుకోలేదట.

ఆమె ఎవరంటే, బాలీవుడ్ కథానాయిక సోనమ్ కపూర్. ఇటీవల చాట్ షో కార్యక్రమంలో బాహుబలి చిత్రంపై తన అభిప్రాయం గురించి అడిగిన ప్రశ్నకు సోనమ్ కపూర్ షాకింగ్ సమాధానం ఇచ్చారు. ఆ సినిమా(బాహుబలి) చూడలేదు. నేను ఆ చిత్రం కథ విన్నా, అందులో నటించే అవకాశం వచ్చింది. కథ అద్భుతంగా ఉంటుంది అని సోనమ్ అన్నారు. ఈ విషయాన్ని ఆమె బయటపెట్టగానే ఇంత చక్కటి అవకాశాన్ని సోనమ్ ఎందుకు వదులుకుంది? అని అక్కడి వాళ్లంతా ఆశ్చర్యపోయారట. మరి ఏ కారణంగా ఈ అవకాశం వద్దనుకుందో, ఏ పాత్రలో తనను నటించమన్నారో సోనమ్ చెప్పలేదు. ఇంకా బాహుబలి గురించి ఇలాంటి సంచలన విషయాలు బయటపడతాయో చూడాలి.

English summary

Sonam Kapoor rejected act in Baahubali movie