దానికి అంత అక్కర్లేదు ... అది చాలు ...

Sonam Kapoor Reveals Her Fitness Secrets

04:23 PM ON 15th February, 2016 By Mirchi Vilas

Sonam Kapoor Reveals Her Fitness Secrets

అయి బాబోయ్ ఈ మధ్య తారలు నాజూకు గా ఉండడానికి రకరకాల చిట్కాలు ప్రయోగిస్తుంటే, బాలీవుడ్‌ కథానాయిక సోనమ్‌ కపూర్‌ మాత్రం తాను అందంగా ఉండడానికి చర్యలు తీసుకుంటూ , ఆరోగ్యం కోసం పాఠాలు కూడా చెప్పేస్తోంది. సినిమాల్లోకి రాకముందు సోనమ్‌ బరువు వంద కిలోలపైనే ఉండేది. సినిమా కోసం బాగా బరువు తగ్గి నాజూకుగా తయారై, బాలీవుడ్‌లో ఫిట్‌నెస్‌కు ప్రతీకగా నిలిచింది. డిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సోనమ్‌ ఆరోగ్యం గురించి స్పీచ్ ఇచ్చేసింది. ‘‘ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ విషయంలో ప్రజల ప్రాధాన్యం పెరుగుతోంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఆరోగ్య పరిరక్షణ విషయంలో జాగ్రత్తగా ఉంటున్నారు. ఆరోగ్యవంతమైన జీవితం కోసం కచ్చితమైన ఆహారపు అలవాట్లు, కసరత్తులు ఎంతగా ఉపయోగపడతాయో ప్రజలు అర్థం చేసుకున్నారు ఇక బరువు తగ్గటం ఏదో పెద్ద కార్యక్రమం అనుకుంటాం . అంతేకాదు దీని కోసం ఎంతో డబ్బు వృధా చేసుకుంటారు. అయితే అదంతా వేస్ట్. అసలు అంతంత సొమ్ము తగలేయ్యక్కర్లేదు. కేవలం నడక ద్వారానే బరువు తగ్గడానికి మార్గం ఏర్పరచుకోవచ్చు. అదేదో గంటల కొద్దీ కూడా కాదు, రోజూ 30 నిమిషాల సేపు నడిస్తే శరీరంలో నవోత్తేజం వస్తుంది. ఆటోమేటిక్ గా బరువు తగ్గిపోతాం' అని ఒయలు ఒలబొస్తో సొనమ్ చెప్పింది. మరి రెడీ అవ్వండీ ....

English summary

Bollywood Slim Beauty Sonam Kapoor has revealed her fitness secret.Sonam Kapoor in an event in Delhi says that evwry one in India got awareness in their Body Fitness and she also says that by walking for half an hour Dialy one can reduce weight