ఆ పరిస్థితి మారుతుందని అనుకుంటున్నా

Sonam Kapoor Says I Dont Work For Awards

09:56 AM ON 11th February, 2016 By Mirchi Vilas

Sonam Kapoor Says I Dont Work For Awards

సోనమ్‌ కపూర్‌ నటించిన ‘నీరజ’ సినిమా త్వరలో విడుదల కానుంది. రామ్‌ మధ్వానీ డైరెక్ట్‌ చేసిన ‘నీరజ’లో ఆమె టైటిల్‌ రోల్‌ పోషిస్తోంది. ఇటీవల సల్మాన సరసన ‘ప్రేమ్‌ రతన్ ధన్ పాయో’ సినిమాలో నటించి అలరించిన సొనమ్ ఇప్పుడు నీరజ లో మెప్పించనుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 'నా దృష్టంతా నటన మీదే. అవార్డుల మీద కాదు. అసలు నేను అవార్డుల కోసం పనిచేయను. సినిమా కోసమే పనిచేస్తా. గుర్తింపు వస్తే సంతోషమే. అవార్డులు ఎందుకు ముఖ్యమంటే అవి, మన విలువను పెంచుతాయి. మరిన్ని మంచి పాత్రలు చెయ్యడానికి ప్రోత్సాహాన్నిస్తాయి. పోటీతత్వాన్ని పెంచుతాయి’’ అంటూ లెక్చరిస్తోంది. ఇక కొంత కాలంగా పలు అవార్డుల కార్యక్రమాల విశ్వసనీయత గురించి పలువురు బాలీవుడ్‌ తారలు ప్రశ్నిస్తున్న నేపధ్యంలో సొనమ్ తన అభిప్రాయాన్ని నిక్కచ్చిగా చెప్పేసింది. ‘‘ఆ పరిస్థితి మారుతుందని అనుకుంటున్నా. ఏవైనా అభ్యంతరాలు, ప్రశ్నలు వచ్చినప్పుడల్లా మార్పు అనేది వస్తూనే ఉంటుంది. జనం సరిగా పనిచేయడం మొదలు పెడతారు’’ అని కుండబద్దలు కొట్టినట్లు చెబుతోంది. ఇంతకీ ఈమె నటించిన చిత్రాలకు కలెక్షన్లేనా ... అవార్డులూ ఉన్నాయా ....

English summary

Bollywood Glamorous Heroine Sonam Kapoor Says that She don't work for awards and rewards.She says that she will do any character if she likes the movie story.