ఇక ఆ కోరిక తీరదేమో: సోనమ్ కపూర్

Sonam Kapoor talks about her graduation

12:02 PM ON 17th October, 2016 By Mirchi Vilas

Sonam Kapoor talks about her graduation

బాలీవుడ్ లో సోనమ్ కపూర్ అంటే... ఫ్యాషన్ కి నిలువెత్తు నిదర్శనం. స్టార్ హీరోయిన్, పైగా ఓ స్టార్ హీరో కూతురు. స్టార్ కిడ్ నుంచి హీరోయిన్ గా ఎదగడానికి సోనమ్ కు దాదాపు ఎనిమిది సంవత్సరాల సమయం పట్టింది. ఇన్ని సంవత్సరాల కాలంలో తనకు చాలా సినిమాల్లో అవకాశాలు రాలేదనీ దానికి కారణం తన తండ్రే అంటుంది సోనమ్. ఈ మధ్య ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించింది. నా సినీ కెరీర్ లో 'నీర్జా' ఓ ప్రత్యేకమైన సినిమా మాత్రమే కాదు, నన్ను మంచి నటిగా చూపించిన చిత్రం. నాకు నిఖార్సైన విజయాన్ని అందించింది. అంత మంచి సినిమా చేసిన తరువాత మామూలు సినిమా చేయాలని అనిపించలేదు. అందుకే కొద్దిగా గ్యాప్ వచ్చింది.

ప్రస్తుతం 'వీర్ ది వెడ్డింగ్' సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నా. ఇందులో కరీనా కూడా నటిస్తోంది. ఈ సినిమా నాకు నీర్జా అంత మంచి పేరు కచ్చితంగా తీసుకు వస్తుంది. అని చెప్పింది. ఇక వృత్తి పరంగా సంతృప్తిగానే ఉంది. చదువు విషయంలోనే కొద్దిగా అసంతృప్తి ఉంది. ఇంటర్మీడియట్ అయిపోగానే సినిమాల్లోకి వచ్చేశా. దాంతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేయలేకపోయా. ఎప్పటికైనా నేను గ్రాడ్యుయేట్ అనిపించుకోవాలన్నదే నా కోరిక. ఇప్పుడున్న బిజీ షెడ్యూల్ లో ఆ కోరిక తీరదేమో అనిపిస్తుంది.

English summary

Sonam Kapoor talks about her graduation