క్రెడిట్‌ అంతా ఆయనదే అంటున్న సోనమ్‌

Sonam Says Neerja Credit Goes To Director

09:58 AM ON 22nd February, 2016 By Mirchi Vilas

Sonam Says Neerja Credit Goes To Director

ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు రామ్‌ మధ్వానీ తెరకెక్కించిన ‘నీర్జా’ చిత్రానికి మంచి రెస్పాన్స్ రావడంతో యూనిట్ అంతా హ్యాపీ గా వుంది. తొలిరోజు కలెక్షన్స్ అదిరిపోవడంతో ఆనందమే ఆనందం. ఇక ఈ చిత్రంలో టైటిల్ రోల్ పోషించిన సొట్టబుగ్గల సుందరి సోనమ్‌ కపూర్‌ అయితే తన నటనకు మంచి పేరు రావటంతో తెగ సంబరపడిపోతోంది. నీర్జా బానోత్‌ పాత్రలో ప్రేక్షకుల్ని మెప్పించడానికి చాలానే కసరత్తులు చేసిన ఈ భామ మాత్రం ఈ చిత్రం విజయం క్రెడిట్‌ అంతా దర్శకుడి ఖాతాలోనే పడుతుందని చెబుతోంది.

ఈ సినిమాలో నటించేందుకు ఒప్పుకున్న దగ్గర్నుంచీ.. ప్రతిసారీ దర్శకుడి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకునేదట సోనమ్‌. ‘‘బాగా చేస్తున్నానా? చేయట్లేదా? అని ఒకటికి రెండుసార్లు దర్శకుడు రామ్‌ని కనుక్కొని మరీ షూటింగ్‌లో పాల్గొనేదాన్ని , నేను దర్శకుల నటిని. ఈ చిత్రంలో నేను బాగా నటించడానికి కారణం దర్శకుడే, క్రెడిట్‌ అంతా ఆయనదే’’ అని సోనమ్‌ ఆనందంతో చెప్పుకొస్తోంది.

English summary