సమాధి నుంచి మాటలు - పాటలు

Songs and words coming from grave in UP

11:14 AM ON 31st May, 2016 By Mirchi Vilas

Songs and words coming from grave in UP

అవునా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. సమాధిలోంచి పాటలొస్తున్నాయి.. బతికే వున్నాను బయటకు తీయండనే మాటలు వినిపిస్తున్నాయి. ఇది ముమ్మాటికీ నిజం అని ఇర్ఫాన్ కుంటుంబసభ్యులు చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్ మీరట్ ప్రాంతంలోని జలాల్ పూర్ కు చెందిన యువకుడు ఇర్ఫాన్ మూడు నెలల క్రితం అనారోగ్యంతో కన్నుమూశాడు. అంత్యక్రియలు పూర్తి చేసి ఇర్ఫాన్ ను సమాధి చేశారు. అయితే, ఇర్ఫాన్ సోదరుడు కొన్ని రోజుల క్రితం సోదరుడి సమాధి దగ్గరకు వచ్చినప్పుడు ఎవరో హిందీ సాంగ్ హమ్ చేస్తున్నట్టుగా గుర్తించాడు. అచ్చం అన్న గొంతులాగే ఉందని సమాధి దగ్గరకెళ్లి చూశాడు.

కచ్చితంగా అన్నగొంతేనని నిర్దారించుకుని తండ్రికి విషయం చెప్పాడు. తండ్రి మిగతా సోదరులు కూడా సమాధి దగ్గరకు చేరుకుని అక్కడ నుంచి వచ్చే పాటలు విన్నారు. పాటలంటే ఎంతో అభిమానించే తమ ఇర్ఫాన్ దే ఈ గొంతు అని తేల్చేశారు. దీంతో ఈ విషయం చుట్టుపక్కల ప్రాంతమంతా వ్యాపించింది. దీంతో తండ్రి తన కొడుకు సమాధి తవ్వేందుకు అనుమతివ్వాలంటూ ఆ ఊరి సర్పంచ్ ని కోరాడు. దీనికి ప్రభుత్వ అనుమతి అవసరం కావడంతో విషయం ఎస్పీ దగ్గరకు వెళ్లింది ఎలా స్పందించాలో అర్థంకాని స్థితిలో విషయం అక్కడ్నుంచి కలెక్టర్ దగ్గరకు చేరవేశారు.

ఈ పరిణామాలతో భయం గుప్పెట్లో జలాల్ పూర్ వాసులు బిక్కుబిక్కుమంటుంటే, ఇదంతా భ్రమ మాత్రమేనని మానసిక వైద్యులు కొట్టి పారేస్తున్నారు. ఇంతకీ ఈ మిస్టరీ ఎలా వీడుతుంది చెప్మా...

English summary

Songs and words coming from grave in UP