పోలీసుల అదుపులో సోనియా, రాహుల్‌

Sonia And Rahul Gandhi Arrested In Delhi

06:43 PM ON 6th May, 2016 By Mirchi Vilas

Sonia And Rahul Gandhi Arrested In Delhi

ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పార్టీ నేతలు చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారి తీసింది. జంతర్‌ మంతర్‌ వద్ద ధర్నా అనంతరం పార్లమెంటుకు బయలుదేరిన కాంగ్రెస్‌ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో కాంగ్రెస్‌ ప్రముఖులనంతా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొద్ది సేపటి తర్వాత వారిని వదిలేశారు. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, సహా పలువురు పార్టీ నేతలను పార్లమెంటు స్ట్రీట్‌ పోలీసు స్టేషన్‌కు తరలించి అనంతరం విడిచిపెట్టారు. దిల్లీ పోలీసులు, ఎస్పీజీ సెక్యూరిటీ అధికారులు పార్టీ నేతలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. బారికేడ్లు తొలగించి ర్యాలీ చేసేందుకు ప్రయత్నించడంతో నిబంధనలు ధిక్కరించారని పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వదిలి పెట్టారు.

ఇవి కూడా చదవండి:పవన్ కళ్యాణ్ తో రెండు రోజులు గెస్ట్ హౌస్ లో ఉందట!

ఇవి కూడా చదవండి:బాలికపై అత్యాచారం చేసిన ఎమ్మెల్యే

English summary

AICC President Sonia Gandhi and Rahul Gandhi, Manmohan Singh were arrested at Delhi in Jantarmantar.