కోర్టు కి తల్లీ కొడుకులు హాజరయ్యేనా ?

Sonia and Rahul gandhi to attend to court

11:21 AM ON 8th December, 2015 By Mirchi Vilas

Sonia and Rahul gandhi to attend to court

ఢిల్లీ హైకోర్టు తీర్పు తో ఎఐసిసి అధినేత్రి సోనియా గాంధి , ఆమె కుమారుడు , ఎంపి , ఎఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధి కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థతి ఏర్పడింది. అయితే ఢిల్లీ హైకోర్టు తీర్పు పై సుప్రీం కోర్టుని ఆశ్రయించాలని నిర్ణయించారు. పదేళ్ల పాటు సింగిల్ హ్యండ్ తో దేశాన్ని నడిపించిన సోనియా గాంధి . ఒక కేసుకు సంబంధించి కోర్టు గుమ్మం ఎక్కాల్సి రావటం.. ప్రధానమంత్రి సీటులో కూర్చోవాలని అమ్మ కలగన్న రాహుల్ గాంధీ కూడా కోర్టుకు రావాల్సి రావటం ఇప్పుడు చర్చనీయం అయింది. వివరాలలోకి వెలితే , నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన వివాదం గాంధీ ఫ్యామిలీని చుట్టుకునేలా వుంది. కొన్నాళ్ల క్రితం కార్యకలాపాలు ఆపేసిన నేషనల్ హెరాల్డ్ పత్రికను ప్రచురించే ‘‘అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్’’ సంస్థకు కాంగ్రెస్ పార్టీ రూ.90.25కోట్లు అప్పుగా ఇచ్చింది. అయితే.. ఆ అప్పు వసూలు సాధ్యం కాకపోవటంతో.. 2010 డిసెంబరు 10న ఆ రుణాన్ని వసూలు చేసే బాధ్యతను యంగ్ ఇండియా అనే చారిటీ సంస్థకు పార్టీ కేవలం రూ.50 లక్షలకు అప్పజెప్పింది. రూ.90కోట్ల అప్పును వసూలు చేయటానికి రూ.50లక్షలకే వేరే వారికి ఇచ్చేస్తారా? అన్నది ప్రధాన ప్రశ్న.

ఇప్పుడు ఇదే వ్యవహారం తల్లీ.. కొడుకుల్ని చుట్టుకుంది. అంత పెద్ద మొత్తాన్ని ఒక సంస్థకు రూ.50లక్షలకే ఎలా అప్పజెబుతారని? ఆ అవసరం ఏమొచ్చిందన్నది కోర్టు ప్రశ్న. నేషనల్ హెరాల్డ్ దినపత్రికకు కాంగ్రెస్ పార్టీ అప్పు ఇచ్చిన రూ.90 కోట్లను రూ.50లక్షలకు అప్పజెప్పిన యంగ్ ఇండియాలో సోనియా గాంధి కి, .. రాహుల్ కు చెరో 38 శాతం చొప్పున వాటా ఉందని.. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారన్నది ఆరోపణ.

బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి ఈ ఆరోపణ చేస్తూ.. కోర్టు గుమ్మం ఎక్కారు. అయితే.. కోర్టుకు రావాల్సిన అవసరం లేదంటూ తల్లీకొడుకులు పెట్టుకున్న పిటీషన్ ను తాజాగా ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. అంతేకాదు.. నిందితులుగా ఉన్న వారిలో నేర స్వభావం ఉన్నట్లుగా కనిపిస్తోందని వ్యాఖ్యానించటం కాంగ్రెస్ వర్గాల్లో కొత్త గుబులు రేపుతోంది. ఏం జరుగుతుందా? అన్న ఉత్కంట నెలకొంది. విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ కేసులో తల్లీ కొడుకులతో పాటు.. ఈ కేసులో నిందితులుగా ఉన్న సుమన్ దుబే.. మోతిలాల్ వోరా.. అస్కార్ ఫెర్నాండెజ్.. శ్యాం పిట్రోడా.. యంగ్ ఇండియా లిమిటెడ్ కంపెనీ ప్రతినిధిని విచారణకు హాజరు కావాలంటూ ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. మంగళవరం జరిగిన విచారణ లో తమకు మినహాయింపు ఇవ్వాలని చేసిన విజ్ఞప్తి ని కోర్టు తిరస్కరించింది ఈ నెల 19న స్వయం గా హాజారు కావాలని పేర్కొంది. అయితే సుప్రీం ను ఆశ్రయించడం ద్వారా కోర్టు కు హాజరు కాకుండా వుండాలని చేస్తున్న ప్రయత్నం ఫలించేనా ?

English summary

AICC cheif sonia gandhi and rahul gandhi have ordered to attend to court on december 19th