సడన్ గా ఈమెకు ఏమైంది?

Sonia Gandhi Admitted in ICU in Delhi Hospital

10:31 AM ON 4th August, 2016 By Mirchi Vilas

Sonia Gandhi Admitted in ICU in Delhi Hospital

అవును, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ యుపి ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిని ఎన్నుకున్నారు. బ్రహ్మాండమైన రోడ్ షో సాగుతుంటే, వేలాది కార్యకర్తలు హుషారుగా కదులుతున్నారు. ఇంతలోనే తీవ్రమైన అస్వస్థత కారణంగా వారణాసిలో తన రోడ్ షోను సోనియాగాంధీ అర్ధంతరంగా ముగించేశారు. చార్టెడ్ ఫ్లైట్ లో హుటాహుటీన ఢిల్లీ వెళ్లి ఆర్మీ రీసర్చ్ అండ్ రిఫరల్ ఆస్పత్రి ఐసియులో చికిత్స పొందుతున్నారు. అయితే ఈమె ఆరోగ్యం ఇప్పుడు నిలకడగా ఉంది. ప్రస్తుతం ఆమె ఢిల్లీలోని గంగారామ్ ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నారని ఏఐసీసీ మీడియా విభాగం ఇన్ చార్జి రణ్ దీప్ సుర్జేవాలా తెలిపారు.

చికిత్స అనంతరం పరిస్థితి మెరుగవడంతో ఆమెను గంగారామ్ ఆసుపత్రికి మార్చారు. సోనియా వద్ద ప్రస్తుతం ఆమె కుమారుడు, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, కూతురు ప్రియాంకా గాంధీ ఉన్నారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న సోనియా రోడ్ షో కారణంగా డీహైడ్రేషన్ కి గురయ్యారని కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ అంటున్నారు. మొత్తానికి ఈ పరిణామం ఎటు దారితీస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి:చరిత్రలో చెత్త ప్రెసిడెంట్ ఒబామాయే: చెలరేగిన ట్రంప్

ఇవి కూడా చదవండి:అందరి ముందు భర్తను చెప్పుతో కొట్టిన యాంకర్!

English summary

All India Congress Committee president Sonia Gandhi suddenly quits from the election Campaign in Varanasi in Uttar Pradesh and went Delhi and Admitted in ICU in Delhi Hospital due to some health problem.