పార్టీ దెబ్బతిన్నా .. తల్లీ కూతుళ్లు సిమ్లాలో ఎంజాయ్

Sonia Gandhi Enjoying Vacation Withe Her Daughter

11:08 AM ON 15th June, 2016 By Mirchi Vilas

Sonia Gandhi Enjoying Vacation Withe Her Daughter

ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ మాత్రం బాగోలేదు. అన్నిచోట్లా అపజయాలే మూటగట్టుకుంటోంది. ఇక తెలంగాణాలో సైతం పార్టీ ఎంపిలు ఎంఎల్ఏలు గోడ దూకేసి, టిఆర్ఎస్ లో చేరిపోయి, కారులో షికారు చేస్తున్నారు. మరి ఇలాంటి కీలక సమయంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారన్న విషయాల్ని క్రాస్ చెక్ చేస్తే ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. తరచూ తగులుతున్న ఎదురుదెబ్బల నుంచి రిలాక్స్ అవ్వాలనున్నారో.. టైం బాగోలేని సమయలో కలిసి రాని అంశాల విషయాల్ని పట్టించుకోవటం కన్నా.. కాస్త దూరంగా వెళ్లాలని అనుకున్నారేమో కానీ.. సోనియాగాంధీ.. ఆమె గారాల పట్టి ప్రియాంక వధేరా ఇద్దరూ కలిసి సిమ్లాలో ఎంజాయ్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

ఢిల్లీ నుంచి సోనియా.. ప్రియాంకలు ఇద్దరూ సిమ్లాలో ప్రత్యక్ష కావటమేకాదు..ఈ చల్లటి ప్రదేశంలో తల్లీ కూతుళ్లు ఇద్దరూ బాగా ఎంజాయ్ చేశారని చెబుతున్నారు. సిమ్లాలో ప్రియాంక కొత్తగా కట్టుకున్న ఇంటిని పరిశీలించారని.. వారు సంతృప్తిని వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. దాదాపుగా నిర్మాణం పూర్తి కావొస్తున్న ప్రియాంక ఇల్లు, సోనియాకు బానే నచ్చిందట. నిత్యం రాజకీయాల్లో బిజీబిజీగా ఉండే సోనియాలాంటి వారు ఆటవిడుపు కోసం జరిపే పర్యటనలు అందరి దృష్టిని ఆకర్షిస్తాయనడానికి సోషల్ మీడియాలో హడావుడి చేస్తున్న వారి ఫోటోలే నిదర్శనమని చెప్పక తప్పదు. మొత్తానికి పార్టీ పరిస్థితి ఎలా వున్నా ఏమాత్రం బెంగ లేకుండా, కూల్ గా వుండడం మామూలు విషయం కాదు. పార్టీ శ్రేణులు కూడా టెన్షన్ వదిలేసి ఇలా హ్యాపీగా వుంటే మంచి రోజులు వాటంతటవే వస్తాయని కామెంట్స్ పడుతున్నాయి.

ఇవి కూడా చదవండి:ఒవైసీ మీద కత్తి పడింది

ఇవి కూడా చదవండి:తాగి డ్రైవింగ్ చేసి.. ఇద్దరిని చంపేసి.. నాన్న దగ్గర డబ్బు తీసుకోమన్న యువకుడు(వీడియో)

English summary

All India Congress Party President Sonia Gandhi was enjoying vacation with her daughter Priyanka Gandhi in Shimla. Priyanka Gandhi recently build a house in Shimla and Sonia gandhi was quite impressed with the house.